27.06.2024 గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఊహించ‌ని లాభాలు..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 27, 2024 / 06:47 AM IST

మేషం

మేష రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఈ రోజంతా స్నేహితులతో సరదాగా గడుపుతారు. వృత్తి వ్యాపార రంగాల వారికి ఈ రోజు ఆర్ధికంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. బంగారు భవిష్యత్​కు బాటలు వేసుకుంటారు. ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. సంపద వృద్ధి చెందుతుంది.

వృషభం

వృషభ రాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. గతంలో చేపట్టిన కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా ముగుస్తాయి. ముఖ్యంగా ఉద్యోగులకు శుభకరంగా ఉంటుంది. ప్రమోషన్లకు అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు.

మిథునం

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. అనారోగ్య సమస్యల కారణంగా పనిలో ఏకాగ్రత లోపిస్తుంది. ఆర్ధిక సమస్యల వలన ఏ పనులు ముందుకు సాగవు.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూలంగా ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు పనులకు ఆటంకాలుగా తయారవుతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఊహించని ఖర్చులు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.

సింహం

సింహ రాశి వారికి శుభసమయం నడుస్తోంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తుంటాయి. ఒత్తిడికి దూరంగా ఉండండి.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు శుభకరంగా ఉంటుంది. సమాజానికి మేలు చేసే పనులు చేయడం ద్వారా కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన ఆర్ధిక వనరులను సమకూర్చుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

తుల

తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం సహకరించదు. ఆర్ధిక లావాదేవీల్లో మోసాలు జరిగే అవకాశముంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ ఆత్మవిశ్వాసమే మీ విజయసూత్రం. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. అసూయపరుల మాటలకు విలువ ఇవ్వొద్దు. కుటుంబ వ్యవహారాల్లో ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక వ్యవహారాల్లో ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు పనిపట్ల ఏకాగ్రతతో ఉంటే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. వృథా ఖర్చులు తగ్గించండి. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముందుచూపుతో, ప్రతిభతో ఆటంకాలను అధిగమిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. బుద్ధిబలంతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. ఆర్ధిక లాభాలు ఉంటాయి.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. సంపాదన వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు.

Latest News