28.06.2024 శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి శుభ‌ఫ‌లితాలు..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 28, 2024 / 06:46 AM IST

మేషం

మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు సాఫీగా సాగిపోతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలుంటాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారికి, నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.

వృషభం

వృషభ రాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. వ్యాపారస్తులు వ్యాపారంలో పెద్ద ప్రాజెక్టును అందుకుంటారు. ముఖ్యంగా స్థిరాస్తి రంగం వారికి శుభ ఫలితాలు ఉంటాయి.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్పటినుంచో రావలసిన డబ్బులు చేతికి అందుతాయి. సంపాదన పెరుగుతుంది. వ్యాపారాలు మంచి లాభాలను గడిస్తారు. అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతుంది.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు అన్నీ పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొనవచ్చు. ఇంటి మరమ్మతుల నిమిత్తం అధిక ధనవ్యయం ఉండవచ్చు. సంపద పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రోజు ఈ రాశివారు ఆర్ధికంగా ఉన్నత స్థానానికి ఎదుగుతారు. కుటుంబ సభ్యులతో తీర్ధ యాత్రలకు వెళతారు. వృత్తి వ్యాపారాలు ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. ఇతరులతో వాదనలకు దిగే అవకాశముంది. ఈ రోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉండవచ్చు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో విజయం ఉంటుంది. సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులను పొందుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు.

తుల

తులారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబ పరంగా మంచి శుభవార్తలు వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. తీర్థయాత్రల కోసం ధనవ్యయం ఉంటుంది.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి మీ ఎదుగుదలే సమాధానం అవుతుంది. మొహమాటాలకు పోయి చిక్కుల్లో పడే పరిస్థితులు తెచ్చుకోవద్దు.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు, వృత్తి నిపుణులకు తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులకు నష్ట సూచన ఉంది. కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు అన్నిటిపై శ్రద్ధ వహిస్తారు. ఈ రోజు ఉద్యోగస్తులకు, విద్యార్ధులకు అనుకూలంగా ఉండవచ్చు.

కుంభం

కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. వృథా ఖర్చులు అదుపు చేసుకుంటే మంచిది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో మనస్పర్థలు ఏర్పడవచ్చు.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో మోసపోయే ప్రమాదముంది. జాగ్రత్త వహించండి. సహనంతో ఉండడం అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే నష్టం తప్పదు. ఇంటా బయట కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది.

Latest News