30.06.2024 ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఆదాయానికి మించిన ఖ‌ర్చులు..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 30, 2024 / 06:14 AM IST

మేషం

మేషరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. శుభ ఫలితాలు ఉంటాయి. అదృష్టం వరించి విజయం తలుపు తడుతుంది. ధనలాభాలు, పదోన్నతులు ఉంటాయి. ఈ రోజంతా ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తూ వేడుకల్లో మునిగితేలుతారు.

వృషభం

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్ధిక లాభాలను అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి ఉండవచ్చు. మీ కుటుంబం గురించి లేదా మీ పిల్లల గురించి ఒక శుభవార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మధురస్మృతులు నెమరు వేసుకుంటారు.

మిథునం

మిథున రాశి వారికి ఈ రోజు సత్ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆర్ధికంగా ఎదుగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ లాభాలు పెరగడమే కాకుండా, పాత బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశం ఉంది.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నంలో విజయం సాధించలేరు. ఉద్యోగులు ఆశించిన ఫలితాలు రావాలంటే మరింత కష్టపడాలి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. శత్రువులు దెబ్బ తీయడానికి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి అవకాశం ఇవ్వొద్దు. కోపాన్ని నియంత్రించుకోండి. మాట్లాడేటప్పుడు శ్రద్ధ వహించండం మంచిది. కుటుంబ వివాదాలకు అవకాశం ఉంది.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఎటు చూసినా విజయాలే కనిపిస్తున్నాయి. మీ కష్టానికి ప్రతిఫలమే ఈ విజయాలు. వ్యాపారులు తిరుగులేని విజయాలను సాధించి మంచి లాభాలను గడిస్తారు.

తుల

తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీడియా, పత్రిక రంగం వారికి ఈ రోజు ప్రత్యేకంగా ఉంటుంది. మీ నైపుణ్యాన్ని చూసి అంతా ప్రశంసిస్తారు. కొంత శ్రమతో గొప్ప శుభ ఫలితాలను సాధిస్తారు. వ్యాపారులకు ఆదాయం మెరుగు పడుతుంది.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు తీవ్రమవుతాయి. అయితే తిరుగులేని నాయకత్వంతో, గొప్ప ప్రతిభతో మీతో పాటు మీ ఉద్యోగులను కూడా కష్టం నుంచి గట్టెక్కిస్తారు. ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు ఉండవచ్చు.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు పనిలో తమదైన ముద్ర వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ పై అధికారుల నుంచి ప్రసంశలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలం ఉంటుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. రాజకీయ నాయకులకు ప్రజాసంబంధాలు అద్భుతంగా మెరుగు పడతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారు మీ పక్కనే ఉంటారు. వ్యూహాత్మకంగా వ్యహరించాలి. ఎక్కడా నిగ్రహం కోల్పోవద్దు. లేకపోతే ఇంట్లోనూ, ఆఫీస్​లోనూ సమస్యలు ఏర్పడతాయి.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి చెప్పుకోతగ్గ పురోగతి ఉండదు. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే మోసపోవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యల కారణంగా చికాకుతో ఉంటారు.

Latest News