03.06.2024 సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు కొత్త ప‌నులు ప్రారంభించొద్దు..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 3, 2024 / 06:17 AM IST

మేషం

మేషరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. కొత్తగా ఏ పనులు ఈ రోజు మొదలు పెట్టవద్దు. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం సహకరించదు. కోపాన్ని నియత్రించుకుంటే మంచిది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు జీతం పెరుగుదల ఉండవచ్చు. స్థిరాస్తి రంగం వారికి సత్ఫలితాలు ఉంటాయి. ఏకాగ్రత, చిత్తశుద్ధితో పనిచేసి మంచి విజయాలు సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. విహారయాత్రలకు వెళతారు.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఆదాయం బాగా పెరుగుతుంది, పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి పట్టింది అంతా బంగారం అవుతుంది. వృత్తి ఉద్యోగాలు చేసేవారికి గొప్ప విజయాలు ఉంటాయి.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అన్ని పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక ఎదుగుదలకు నూతన ప్రణాళికలు రూపొందిస్తారు. కుటుంబసభ్యులపై శ్రద్ధ పెడతారు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు పొందటానికి తీవ్రంగా శ్రమించాలి. ఉద్యోగస్తులు చేసే పనుల్లో సవాళ్లు ఎదురవుతాయి. ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు. పట్టుదలతో ముందుకెళ్తే విజయం వరిస్తుంది.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమఫలితాలు ఉంటాయి. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయ వృద్ధి ఉంటుంది. బంగారు, వెండి వ్యాపారులకు, స్థిరాస్తి రంగం వారికి లాభాల పంట పండుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది.

తుల

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఉగ్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఓ శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం రోజు మొత్తం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగుల సహాయం లభిస్తుంది. ఆర్థిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పనులను పూర్తిచేస్తారు.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వరుస అపజయాలతో నిరాశకు లోనవుతారు. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. రుణాలు చేయాల్సి వస్తుంది.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేసే పనిలో ఆటంకాలు, సవాళ్లు ఎదురవుతాయి. బంధుమిత్రుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆర్ధికంగా శుభఫలితాలు ఉన్నాయి. వృత్తిఉద్యోగ వ్యాపార రంగాల వారికి విశేషమైన కృషితో విజయం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేని మీ వైఖరి కారణంగా అందరికీ విరోధం అవుతారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్త వహించండి.

Latest News