06.06.2024 గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి వివాహ ప్ర‌య‌త్నం స‌ఫ‌లం..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 6, 2024 / 06:39 AM IST

మేష రాశి

మీ దినచర్య అస్తవ్యస్తంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కరించుకోవడం మంచిది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాల నుంచి బయటపడి ప్రయోజనం పొందుతారు.

వృషభ రాశి

కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నూతన వాహనం లేదా ఇంటికి సంబంధించిన విషయాల్లో ముందడుగుపడుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. శుభ‌వార్త వింటారు.

మిథున రాశి

ఈ రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు.. తీసుకోవద్దు. ప్రయాణాలలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేయడంతో సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి

ఈ రాశివారు ఇతరులపై ఆధారపడడం సరికాదు. చేపట్టిన పనులు విజ‌య‌వంతంగా పూర్తిచేస్తారు. మీ కార్యాచరణ ప్రణాళికలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఇదే మంచి సమయం. కొత్తగా పెళ్లైన జంటలు ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.

సింహ రాశి

ఉద్యోగులు ప్రమోషన్‌కి సంబంధించిన సమాచారం వింటారు. మీ పనితీరు మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించాలి. రోజంతా సంతోషంగా ఉంటారు. విలాసాలకు ప్రాముఖ్యత ఇస్తారు.

కన్యా రాశి

ఈ రాశివారు ఈ రోజు ఆందోళనలో ఉంటారు. ఇంటిపెద్దలపై కోపంగా వ్యవహరిస్తారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఇది మంచి సమయం కాదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.

తులా రాశి

ఈ రాశివారు రోజంతా సంతోషంగా ఉంటారు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండడం మంచిది. మీ రహస్యాలను ఎవ్వరితోనూ పంచుకోవద్దు. అనవసర వాగ్ధానాలు చేయొద్దు. విద్యార్థులు కొత్త విష‌యాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు.

వృశ్చిక రాశి

అవివాహితుల ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మెప్పు పొందుతారు. కార్యాలయంలో స్నేహితుల సహకారం ఉంటుంది. ఇంటా బయటా మీ ఆధిపత్యం పెరుగుతుంది.

ధనస్సు రాశి

మాటతీరు విమర్శలకు గురయ్యేలా ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. శత్రువులతో రాజీపడే అవకాశం వస్తుంది. వ్యవసాయ పనులకు ఈ రోజు శుభప్రదం. ఉద్యోగులు, వ్యాపారులు మీ పనిపట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు.

మకర రాశి

ఈ రాశివారు ఈ రోజు ఆర్థిక లాభం పొందుతారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచిసమయం కాదు. ఉద్యోగులు, విద్యార్థులకు పెద్దగా మార్పులుండవు. ఉదర సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడతారు.

కుంభ రాశి

ఈ రోజు కుంభరాశివారు అప్రమత్తంగా ఉండాలి. శత్రువులు మిమ్మల్ని టార్గెట్ చేయాలని ప్రయత్నిస్తారు. వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు ఉంటాయి. పోటీ పరీక్షలు రాసేవారు అనుకూల ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

మీన రాశి

ఈ రాశి ఉద్యోగుల ఆలోచనలు పూర్తిస్థాయిలో అమలు చేయడం సాధ్యం కాదు. ప్రయాణాలు చేసేవారు ఆరోగ్యంపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఓ కొలిక్కి వచ్చేందుకు మరికొంతసమయం పడుతుంది.

Latest News