08.06.2024 శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఈ రోజు శుభ‌యోగం..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 8, 2024 / 07:40 AM IST

మేషం

మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యల కారణంగా మానసికంగా చికాకుతో ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలను పక్కనపెట్టడం మంచిది. వ్యాపారులకు వృతిపరంగా ప్రయాణ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మౌనంగా, ప్రశాంతంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యహారాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఉండవచ్చు. సర్దుబాటు ధోరణి అవలంబిస్తే మంచిది. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికపరంగా పలు ప్రయోజనాలు పొందే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కొన్ని అనుకోని సమస్యల కారణంగా ఆందోళనగా, అశాంతిగా ఉంటారు. వృత్తివ్యాపార రంగాల వారికి పెట్టుబడుల విషయంలో అస్థిరత నెలకొంటుంది. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. బంధు మిత్రుల నుంచి ఆర్ధిక ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. ఉద్యోగులకు ప్రమోషన్, బదిలీ ఉండవచ్చు. ఆదాయం పెరుగుతుంది.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు శుభయోగం ఉంటుంది. ఈ రోజు ప్రారంభించే అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇంక్రిమెంట్లు, పదోన్నతులు ఉంటాయి. వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు. ఓ శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.

తుల

తులారాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలు ఈ రోజు మంచి లాభాలను అందుకుంటారు. వృత్తినిపుణులకు చేపట్టిన పనుల్లో విజయం, ఆర్ధిక పురోగతి ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. కోపావేశాలను అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.

ధనుస్సు

ఈ రోజంతా సంతోషంగా, సరదాగా గడిచిపోతుంది. విదేశీయుల సాంగత్యంలో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి కొత్త ప్రదేశాలలో పర్యటిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ప్రతిపనిలోను విజయం, కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయి. ఆదాయం పదింతలు పెరుగుతుంది. రావలసిన బకాయిలు అందుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధుమిత్రులతో విహారయాత్రలకు వెళతారు.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు కొత్తగా మొదలు పెట్టే ఏ పనులైనా విజయవంతంగా పూర్తవుతాయి. ఖర్చులు పెరగవచ్చు. కానీ ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. విశ్రాంతి అవసరం. కుటుంబంలో కలహాలు, గొడవలు జరగవచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఒత్తిడిని దూరం చేయడానికి ధ్యానం చేస్తే మంచిది.

Latest News