18.05.2024 శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ప్ర‌యాణాలు వాయిదా వేస్తే మంచిది..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - May 18, 2024 / 06:46 AM IST

మేషం

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.మనశ్శాంతి ఉంటుంది. ఉద్యోగులు ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. గతంలో ఉన్న గడ్డు పరిస్థితులు తొలగిపోయి మంచి సమయం వస్తుంది. ఇదివరకు వేధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

వృషభం

వృషభ రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మంచి లాభాలను గడిస్తారు. ఆర్ధిక ప్రయోజనాలు, ప్రమోషన్లు అన్ని శుభాలే జరుగుతాయి. మీ ఉన్నతమైన ఆలోచనలతో, వాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తారు. మీ ప్రతిభకు, నైపుణ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది.

మిథునం

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. కుటుంబ సభ్యులతోనూ ఆస్తుల గురించిన చర్చ వాయిదా వెయ్యండి. లేకుంటే మీరు నిరాశ చెందగలరు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. బంధువుల నుంచి వచ్చిన ఓ శుభవార్తతో మీ ఆనందం రెట్టింపు అవుతుంది. మీ అదృష్టాన్ని మీరే నమ్మలేక పోతారు. మీ పోటీదారులు మీతో గెలవలేక ఓటమిని మౌనంగా స్వీకరిస్తారు. డబ్బుకు లోటుండదు.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు, కుటుంబ సభ్యుల అండతో అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలకు అంత మంచి రోజు కాదు. ఉద్యోగులు శ్రమకు తగిన ఫలం పొందుతారు.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా గడుస్తుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి అన్నింటా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ సరదాగా, సంతోషంగా గడుపుతారు.

తుల

తులా రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అదనపు ఆదాయ వనరులపై దృష్టి సారిస్తే మేలు.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రమోషన్ ఛాన్స్, ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆర్ధికంగా విపరీతమైన లాభాలను అందుకుంటారు. అదృష్ట యోగం ఉంది. ఆకస్మిక ధనలాభం కూడా ఉంది. వ్యాపారులు వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంది.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి మెరుగైన ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. రీసెర్చ్ రంగంలో ఉండేవారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఊహించని విజయాలు సాధించి సంఘంలో మంచి గౌరవం సంపాదిస్తారు.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి ఈ రోజు చాలా ఇబ్బందులు ఒత్తిడి ఉండే అవకాశం వుంది. ఒత్తిడి కారణంగా కోపం, చిరాకు పెరుగుతాయి మౌనంగా ఉంటూ ధ్యానం చేయడం మంచిది. ఇంట్లో శుభకార్యం జరగడం వల్ల ఖర్చులు పెరుగుతాయి.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ ఆలోచనలు కార్యాచరణ పొందాలంటే సన్నిహితుల అండదండలు అవసరం. ఖర్చులు ఆదాయాన్ని మించి ఉంటాయి. వ్యాపారులు పోటీదారుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటారు. ధైర్యంతో పని చేస్తే విజయం మీదే.

Latest News