Site icon vidhaatha

22 నుంచి దుర్గ‌మ్మ శాకాంబ‌రి ఉత్స‌వాలు

విధాత,విజయవాడ: బెజ‌వాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22 వ తేదీ నుంచి మూడు రోజులపాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయి. కూరగాయలతో‌ చేసిన అలంకారంతో మూడు రోజులపాటు దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని దుర్గగుడి పాలకమండలి, అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దాతలు, రైతులు, వ్యాపార వర్గాల నుంచి అవసరమైన కూరగాయలు, పండ్లు సేకరిస్తున్నారు.

Exit mobile version