మేషం
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలను సమర్ధవంతంగా అధిగమిస్తారు. మీ పోటీదారులు మీ అభివృద్హిని చూసి అసూయ పడే స్థాయికి చేరుకుంటారు. ఆర్ధికంగా ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. సహనంతో ఎదురు చూస్తే అద్భుతమైన ఫలితాలుంటాయి.
వృషభం
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి పరంగా నూతన అవకాశాలను అందుకుంటారు. వ్యాపారులు వ్యాపార నిమిత్తం దూరదేశాలకు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణాలు ఊహించని లాభాలను తెచ్చి పెడతాయి. పని ఒత్తిడి కారణంగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మిథునం
మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గడ్డుకాలం నడుస్తోంది. వృత్తి పరంగా తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి. ఆర్ధిక ఇబ్బందులు కూడా తోడవడం వల్ల పరిస్థితి అగమ్యగోచరంగా అనిపిస్తుంది. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం అవసరం. లేకుంటే సమాజంలో పరువుపోయే పరిస్థితి వస్తుంది. వివాదాలు, వాదనలకు దూరంగా ఉండండి.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు పెళ్లి పీటలెక్కుతాయి. విభిన్న సంస్కృతులు గల వ్యక్తులతో ఏర్పడిన పరిచయాలు వృత్తి పరంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో ఈ రోజంతా సరదాగా గడుపుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
సింహం
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా సహచరుల సహకారం, వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల తోడ్పాటుతో అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఉన్నతాధికారులతో కానీ, కుటుంబ పెద్దలతో కానీ అనవసర వాదనలు చేయకండి.
కన్య
కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ రోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకపోతే సన్నిహితులతో సంబంధాలు దెబ్బ తింటాయి. వ్యాపారస్తులు ఈ రోజు ఎలాంటి పెట్టుబడులు పెట్టవద్దు. ఉద్యోగంలో పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి గురవుతారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
తుల
తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఏర్పడిన సమస్యల కారణంగా మానసికంగా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడం వల్ల నిస్పృహతో ఉంటారు. వ్యాపారంలో ఆర్ధిక నష్టాలు ఉండవచ్చు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ రోజు సంతోషంగా గడుస్తుంది. కొత్త వెంచర్స్ లో ఉత్సాహంగా పని చేస్తారు. స్నేహితులతో, కుటుంబంతో సరదాగా సంతోషంగా గడపడం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇది ఒక అరుదైన రోజు. ఈ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించండి. ఈ రోజు మీరు వేసే ప్రతీ అడుగు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. జీవితభాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో నూతన ప్రాజెక్టులు, ఒప్పందాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబంలో ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. అనారోగ్య సమస్యల కారణంగా ఏ పనిపై దృష్టి సారించలేకపోతారు. కుటుంబ కలహాల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.
మకరం
మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక సంబంధమైన కార్యకలాపాలలో ఎక్కువ సమయం గడుపుతారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు పూర్తి అనుకూలం. మీ ప్రయత్నాలు, బాధ్యతలు, కర్తవ్యాలూ అన్నీ ఫలిస్తాయి. వాహన ప్రమాదం జరిగే సూచన ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
కుంభం
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వాక్చాతుర్య నైపుణ్యం ఈ రోజు అద్బుతాలు చేస్తుంది. కీలకమైన చర్చలలో మీ వాక్పటిమకు ప్రశంసలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ పొందుతారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్ధికంగా కలిసి వచ్చి సంపదలు వృద్ధి చెందుతాయి.
మీనం
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొహమాటాలకు పోయి చిక్కుల్లో పడే ప్రమాదముంది. వృత్తి వ్యాపారాలలో ఖచ్చితమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది.