18.04.2024 గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారికి ధ‌న న‌ష్టం..!

ప్ర‌తి ఒక్క‌రూ జాత‌కాల‌ను న‌మ్ముతుంటారు. దీంతో ప్ర‌తి రోజు త‌మ రాశి ఎలా ఉంది..? అనే విష‌యాల‌ను తెలుసుకుని త‌మ దిన‌చ‌ర్య‌ను ప్రారంభిస్తారు. కాబ‌ట్టి జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం మీ రాశిఫ‌లాలు ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - April 18, 2024 / 06:06 AM IST

మేషం

మేష రాశివారికి ఇవాళ అనుకూలంగా లేదు. అన‌వ‌స‌ర చ‌ర్చ‌ల్లో క‌ల్పించుకోవ‌డం కార‌ణంగా గొడ‌వ‌లు సంభ‌వించే అవ‌కాశం ఉంది. వీలైనంత వ‌ర‌కు అలాంటి వాటికి దూరంగా ఉండ‌టం మంచిది. మాన‌సిక అశాంతి, అనారోగ్య స‌మ‌స్య‌లు వెంటాడుతాయి. ఆర్థిక ప్ర‌యోజ‌నాలు చేకూరే అవ‌కాశం ఉంది.

వృషభం

ఈ రాశి వారికి కొంత వ‌ర‌కు మేలు క‌లిగే అవ‌కాశం ఉంది. ప‌నులు స‌కాలంలో పూర్త‌వుతాయి. వ్యాపార‌స్తుల‌కు ప్ర‌యాణాలు లాభిస్తాయి. ఉద్యోగుల‌కు ప్ర‌మోష‌న్లు ల‌భిస్తాయి. ఆదాయం స‌మ‌కూరుతుంది. బంధు, మిత్రుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతారు.

మిథునం

ఈ రాశివారికి ఇవాళ అనుకూలంగా లేదు. తీవ్ర‌మైన నిరాశ‌, నిస్పృహ‌ల‌కు లోన‌వుతారు. రావాల్సిన డ‌బ్బు చేతికి అంద‌దు. అనారోగ్యం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. విద్యార్థుల‌కు చ‌దువుపై ఏక‌గ్రాత లోపిస్తుంది.

కర్కాటకం

ఈ రాశివారికి మిశ్ర‌మ ఫ‌లితాలు ఉంటాయి. అశాంతికి గుర‌వుతారు. వ్యాపారస్తుల‌కు పెట్టుబ‌డులు లాభాల‌ను తెచ్చిపెడుతాయి. విహార‌యాత్ర‌కు వెళ్లే అవ‌కాశం ఉంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు నిరాశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరితోనైనా వాదించడం మానుకోండి. ఆర్ధిక ప్రయోజనాలు ఉన్నాయి.

కన్య

ఈ రాశి వారికి వ్య‌క్తిగ‌తంగా, వృత్తిప‌రంగా ప‌రిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చాక‌చక్యంతో ఆటంకాల‌ను ఎదుర్కొంటారు. ధ‌న‌లాభం ఉంది. వృధా ఖ‌ర్చులు చేయొద్దు.

తుల

తులారాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పని ప్రదేశంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈరోజు అదృష్టకరంగా ఉంటుంది. దైవ దర్శనాలు, ఆర్ధిక ప్రయోజనాలు ఆనందం కలిగిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు మీరు గొప్ప పనులు విజయవంతంగా పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు.

ధనుస్సు

ఈ రాశివారికి ఇవాళ అనుకూలంగా లేదు. ధ‌న న‌ష్టం ఉంటుంది. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ వ‌హించాలి. విహార‌యాత్ర‌కు వెళ్తే మ‌న‌సు కుదుట ప‌డుతుంది. అనారోగ్యం కార‌ణంగా నీర‌సంగా, నిరాశ‌తో ఉంటారు.

మకరం

మకరరాశి వారికి స్వ‌ల్ప అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటాయి. ఆర్థిక స‌మ‌స్య‌లు వెంటాడుతాయి. ఖర్చులు అధికం కాకుండా జాగ్రత్త తీసుకోండి. శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. విహార‌యాత్ర‌ల‌కు వెళ్లే అవ‌కాశం ఉంది.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అదృష్ట యోగం పడుతుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం అనుగ్రహిస్తాయి. ఈ ఆనందాన్ని ఆస్వాదించండి. విందువినోదాల్లో పాల్గొంటారు. ఆదాయం అనుకూలంగానే ఉంటుంది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వాదనలకు దూరంగా ఉంటేనే మంచిది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా లేదు.

Latest News