21.04.2024 ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారు కోపానికి దూరంగా ఉండాలి..!

ప్ర‌తి ఒక్క‌రూ జాత‌కాల‌ను న‌మ్ముతుంటారు. దీంతో ప్ర‌తి రోజు త‌మ రాశి ఎలా ఉంది..? అనే విష‌యాల‌ను తెలుసుకుని త‌మ దిన‌చ‌ర్య‌ను ప్రారంభిస్తారు. కాబ‌ట్టి జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం మీ రాశిఫ‌లాలు ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - April 21, 2024 / 05:30 AM IST

మేషం

మేష రాశివారికి ఆదివారం అనుకూలంగా ఉంది. కోపానికి దూరంగా ఉంటే మంచిది. స్నేహితుల నుంచి స‌హ‌కారం అందుతుంది. ఉద్యోగులు ప‌నితీరు మార్చుకుంటే ప‌నితీరుకి ప్ర‌శంస‌లు అందుకుంటారు.

వృషభం

ఈ రాశివారు ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్తగా ఉండాలి. కొత్త‌గా ప‌రిచ‌య‌మైన వ్య‌క్తుల‌ను అతిగా న‌మ్మొద్దు. వ్యాపారాల‌పై శ్ర‌ద్ధ చూపిస్తారు. స్నేహితుడి ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల బాధ‌ప‌డే అవ‌కాశం ఉంది.

మిథునం

మిథున రాశివారికి ఆదివారం అనుకూలంగా ఉంది. పిల్ల‌ల‌పై నిఘా పెడితే మంచిది. ఉన్న‌తాధికారుల‌తో మాట ప‌ట్టింపులు ఉండే అవ‌కాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో సంతోషంగా గ‌డుపుతారు.

క‌ర్కాట‌కం

ఈ రాశివారు చ‌దువులో అద్భుతంగా రాణిస్తారు. మీరు చేసే పని ప‌ట్ల ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు ఉండే అవ‌కాశం ఉంది. ప్ర‌తికూల ఆలోచ‌న‌లు మ‌నసులోకి రానివ్వ‌కండి.

సింహం

ఈ రాశివారు త‌మ ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి. కోపం త‌గ్గించుకుంటే మంచిది. రోజంతా మీరు చాలా బిజీగా ఉంటారు. కుటుంబ పెద్దల అభిప్రాయాలను గౌరవించండి. ప్రేమ సంబంధాలలో సమస్యలుంటాయి.

కన్య‌

కన్యా రాశివారికి ఈ రోజు మీకు మంచిరోజు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించే ఆలోచన చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవత భాగస్వామి మద్దతు మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు

తుల

ఈ రాశివారు అనుకున్న ప‌నులు పూర్తి చేయ‌డం క‌ష్టం. పాత అప్పులు తీర్చాల‌నే ఒత్తిడికి గుర‌వుతారు. కోపాన్ని నియంత్రించుకుంటే కొంత వ‌ర‌కు బెట‌ర్. జీవిత భాగ‌స్వామి స‌ల‌హాల‌ను స్వీక‌రిస్తే మంచిది.

వృశ్చికం

ఈ రాశివారికి కార్య‌సిద్ది ఉంది. అనుకున్న ఫలితాల‌ను పొందుతారు. అన‌వ‌స‌ర విష‌యాల‌కు స‌మ‌యాన్ని వృధా చేయ‌కండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

ధనుస్సు

ఈ రోజు కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. నూతన విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది.

మకరం

మకర రాశివారు తప్పుడు చర్యలకు, తప్పుడు వ్యక్తులకు దూరంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ సంబంధిత వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉంటాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు.

కుంభం

ఈ రాశివారు జీవితంలో కొత్త మార్పుల‌కు సిద్ధంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగానికి సంబంధించి కొన్ని ఆందోళ‌న‌లు ఉంటాయి. ఆన్‌లైన్ లావాదేవీల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉంటే మంచిది.

మీనం

ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. మీ జీవిత భాగస్వామి కారణంగా సంతోషంగా ఉంటారు. చేపట్టిన ప్రతి కార్యాన్ని సకాలంలో పూర్తిచేస్తారు. మీ మాటతీరు ఆకర్షణీయంగా ఉంటుంది.

Latest News