21 ఏప్రిల్ నుంచి 27 వ‌ర‌కు.. ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..!

చాలా మంది జ్యోతిష్యాన్ని న‌మ్ముతుంటారు. ఏ ప‌ని ప్రారంభించినా స‌రే త‌మ రాశుల ఫ‌లితాల‌ను బ‌ట్టి ప‌నుల‌ను, శుభ‌కార్యాల‌ను ప్రారంభిస్తారు మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - April 21, 2024 / 06:41 AM IST

మేషం

మేష రాశివారికి ఈ వారం మొత్తం అనుకూలంగానే ఉంది. అన్ని శుభ‌యోగాలే. ఉత్త‌మ భ‌విష్య‌త్‌కు బాట‌లు వేసుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని క‌లిగిస్తుంది. అభివృద్ధిలో దూసుకెళ్తారు. వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర‌వ‌కుండా చూసుకుంటే ఇంకా మంచిది. గృహంలో శుభ‌కార్యాలు జ‌రుగుతాయి. ఒక శుభ‌వార్త మీ మ‌నోధైర్యాన్ని పెంచుతుంది. ఆర్థిక విష‌యాల్లో ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకుంటే మంచిది.

వృష‌భం

ఈ రాశివారి ధ‌న లాభం ఉంది. ముఖ్య‌మైన ప‌నుల్లో ధైర్యం త‌గ్గ‌కుండా చూసుకుంటే మంచిది. చేయ‌ని పొర‌పాటుకు బాధ్య‌త వ‌హించాల్సి వ‌స్తుంది. బుద్ధిబ‌లంతో అనుకున్న‌ది సాధిస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించాలి. ఆగ్ర‌హావేశాల‌కు లోను కాకూడ‌దు. నూత‌న వ‌స్తువులు కొనుగోలు చేస్తారు.

మిథునం

ఈ రాశివారికి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఒక శుభ‌వార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. మృదు సంభాష‌ణ అవ‌స‌రం. ఆర్థిక అంశాల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్ర‌శాంతంగా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోవాలి. వివాదాల‌కు దూరంగా ఉంటే మంచిది. అవ‌స‌రాల‌కు ప‌నులు పూర్త‌వుతాయి. వాచా దోషం పెర‌గ‌కుండా చూసుకోవాలి. అన‌వ‌స‌ర‌మైన విష‌యాల‌తో స‌మ‌యాన్ని వృథా చేయొద్దు.

క‌ర్కాట‌కం

ఈ రాశివారు బుద్ధిబ‌లంతో అనుకున్న‌ది సాధిస్తారు. రుణ స‌మ‌స్య‌లు లేకుండా చూసుకోవాలి. కొన్ని కీల‌క‌మైన ప‌నుల్లో పురోగ‌తి ఉంటుంది. కుటుంబ స‌భ్యుల‌కు మేలు జ‌రుగుతుంది. చ‌క్క‌టి ఆలోచ‌న‌ల‌తో విజ‌యాల‌ను అందుకునే అవ‌కాశం ఉంది. తొంద‌ర‌పాటు ఏ మాత్రం ప‌నికిరాదు. ఆర్థికంగా మిశ్ర‌మ ఫ‌లితాలు ఉన్నాయి. అన‌వ‌స‌ర ప్ర‌సంగాలు చేయ‌కండి. వారాంతంలో మేలు జ‌రుగుతుంది.

సింహం

ఈ రాశి వారికి ముఖ్య విష‌యాల్లో ఏకాగ్ర‌త అవ‌స‌రం. ఈ వారం వ్య‌తిరేక ఫ‌లితాలు ఉన్నాయి. తొంద‌ర‌పాటుతో వ్య‌వ‌హ‌రిస్తే స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు. క‌ల‌హాల‌కు దూరంగా ఉంటే మంచిది. వారం మ‌ధ్య‌లో మేలు జ‌రుగుతుంది. అవ‌రోధాల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొంటారు. స‌మ‌య‌స్ఫూర్తితో ఆటంకాలు తొల‌గుతాయి. ఏ ప‌ని ప్రారంభించిన శ్ర‌ద్ధ‌గా ముందుకు వెళ్లాలి.

క‌న్య

ఈ రాశివారు భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో ముందుకు వెళ్తే అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకుంటారు. ప‌ట్టుద‌ల‌తో బాధ్య‌త‌ల‌ను పూర్తి చేయాలి. ఒక వార్త మిమ్మ‌ల్ని బాధ పెడుతుంది. కుటుంబంలో కొన్ని స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతాయి. ఆశించిన ఫ‌లితం ద‌గ్గ‌ర్లోనే ఉంది. వాద‌ప్ర‌తివాదాల జోలికి పోకుండా ఉంటే మంచిది. ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాల విష‌యంలో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం. శారీర‌క శ్ర‌మ పెరిగే అవ‌కాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్ర‌మ ఫ‌లితాలు ఉన్నాయి.

తుల

తులా రాశివారికి బాధ్య‌త‌లు పెరుగుతాయి. ఆశించిన ఫ‌లితాలు కూడా వ‌స్తాయి. ఆర్థికంగా ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. బంగారు భ‌విష్య‌త్ ఉంది. ఒత్తిడి పెర‌గ‌డం వ‌ల్ల మ‌న‌శ్శాంతి లోపిస్తుంది. క‌ల‌హాల సూచ‌న ఉంది. కాబ‌ట్టి మాట్లాడే ముందు జాగ్ర‌త్త‌గా మాట్లాడాలి. వృత్తి, ఉద్యోగ‌, వాపారాల్లో అనుకున్న‌ది ద‌క్కుతుంది. ముఖ్య‌మైప ప‌నుల్లో సంద‌ర్భోచిత నిర్ణ‌యాలు తీసుకోండి.

వృశ్చికం

ఈ రాశివారు మ‌నోబ‌లంతో విజ‌యాలు సాధిస్తారు. మీకున్న ప్ర‌తిభ‌తో విజ‌యాల‌ను అందుకుంటారు. అదృష్టం వ‌రిస్తుంది. ఆర్థికంగా మంచి ఫ‌లితాలు ఉన్నాయి. బంధుమిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. ఒక శుభ‌వార్త ఆనందాన్ని క‌లిగిస్తుంది. మ‌నో ధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి. గృహ‌, వాహ‌న యోగాలు ఉన్నాయి. స‌మాజంలో గుర్తింపు ల‌భిస్తుంది. ఆత్మీయుల స‌ల‌హాల‌తో మంచి జ‌రుగుతుంది.

ధ‌నుస్సు

ధ‌నుస్సు రాశివారికి ఈ వారం మొత్తం శుభ‌కాల‌మే న‌డుస్తోంది. మీరు ప‌ని చేసే రంగాల్లో అనుకూల వాతావ‌ర‌ణం ఉంది. అద్భుత‌మైన విజ‌యాలు సాధించే అవ‌కాశం ఉంది. అవ‌స‌రానికి డ‌బ్బు అందుతుంది. ఒక వార్త మాన‌సిక ఆనందాన్ని క‌లిగిస్తుంది. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. స‌మాజంలో పేరు, ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి. ఏ ప‌ని ప్రారంభించినా ఇట్టే పూర్త‌వుతుంది. శుభ‌కార్యాల్లో పాల్గొంటారు.

మ‌క‌రం

మ‌కర రాశి వారికి ఈ వారం అనుకూల ఫ‌లితాలు లేవు. ముఖ్య విష‌యాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. చేయ‌ని పొర‌పాటుకు నింద‌ప‌డాల్సి వ‌స్తుంది. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం. ఇత‌రుల వ్య‌వ‌హ‌రాల్లోకి వెళ్ల‌క‌పోవ‌డం మంచిది. మీరు ప‌ని చేసే రంగాల్లో అవ‌గాహ‌న‌తో ముందుకు వెళ్లాలి. కీల‌క వ్య‌వ‌హారాల్లో నిదాన‌మే ప్ర‌దానం అన్న నానుడిని గుర్తుంచుకొని ప‌ని చేయాలి.

కుంభం

ఈ వారికి ప‌నులు స‌కాలంలో పూర్త‌వుతాయి. భ‌విష్య‌త్ లాభ‌దాయ‌కంగా ఉంది. కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్య‌వ‌హార‌ల్లో పురోగ‌తి ఉంటుంది. సమాజంలో తోటివారికి ఉప‌యోగ‌ప‌డే ప‌నులు చేస్తారు. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త అవ‌స‌రం. మీ రంగంలో అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగుతారు. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

మీనం

మీన రాశివారికి శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితాలు ఉన్నాయి. అవ‌స‌రానికి త‌గిన స‌హాయం అందుతుంది. వ్యాపారంలో లాభం ఉంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. బుద్ధిబ‌లంతో ప‌ని చేసి ప్ర‌శంస‌లు పొందుతారు. కీల‌క వ్య‌వ‌హారాల్లో తొంద‌ర‌పాటు ప‌నికిరాదు. ఉత్సాహంగా ప‌ని చేస్తే గొప్ప‌వార‌వుతారు. ఆధ్యాత్మికంగా మంచి ఫ‌లితాలు ఉన్నాయి.

Latest News