మేషం
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా పూర్తి ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు. అన్ని రంగాల వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. స్నేహితులు, ప్రియమైన వారిని కలుసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.
వృషభం
వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా మీ మానసిక స్థితి గందరగోళంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు పనులకు ఆటంకాలుగా మారుతాయి. సన్నిహితులతో విభేదాలు ఏర్పడవచ్చు. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.
మిథునం
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అన్నిరంగాల వారు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఆర్ధికంగా ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. కాంట్రాక్టర్లకు, వ్యాపారస్తులకు ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు కూడా అందుతాయి. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత, వృత్తి సంబంధిత వ్యవహారాల గురించి ఈ రోజు ముఖ్యులతో చర్చిస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులకు అధిక పనిభారం కారణంగా అలసట ఉండవచ్చు. మిత్రుల సహకారంతో పనిభారం తగ్గుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
సింహం
సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు పని ఒత్తిడి కారణంగా మానసిక, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. క్షణికావేశం కారణంగా గొడవలు, వివాదాలు ఏర్పడవచ్చు. మీ కోపాన్ని, దూకుడును తగ్గించుకుంటే మంచిది. వ్యాపారంలో లాభాలు తగ్గడం, ఖర్చులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది.
కన్య
కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకోవడం వల్ల నిరాశకు లోనవుతారు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. వివాదాలు ఏర్పడకుండా చూసేందుకు మీ మాటను అదుపులో పెట్టుకోండి. శుభకార్యాలు, ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
తుల
తులా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈరోజు ప్రారంభించిన అన్ని పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్ధిక వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. శత్రువుల నుంచి ప్రమాదం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండండి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. నూతన ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోవడానికి, కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఈ రోజు శుభకరంగా ఉంది. అదృష్టం వరించి పట్టిందల్లా బంగారం అవుతుంది. గత కొన్ని రోజులుగా ఇబంది పెట్టిన సమస్యల నుంచి బయట పడతారు.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది, కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వృత్తివ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా మెరుగైన ఫలితాల కోసం సహనంతో వేచి చూస్తే మంచిది.
మకరం
మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ రోజు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. లేకుంటే చిక్కుల్లో పడతారు. ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
కుంభం
కుంభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. సమయానుకూలంగా వ్యవహరిస్తే మంచిది. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సమస్యల పట్ల ఆచి తూచి వ్యవహరించాలి. సహనంతో ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.
మీనం
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో తీరిక లేకుండా ఉంటారు. కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. కుటుంబ సమస్యల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.