24.04.2024.. నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

చాలా మంది జ్యోతిష్యాన్ని న‌మ్ముతుంటారు. ఏ ప‌ని ప్రారంభించినా స‌రే త‌మ రాశుల ఫ‌లితాల‌ను బ‌ట్టి ప‌నుల‌ను, శుభ‌కార్యాల‌ను ప్రారంభిస్తారు మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - April 24, 2024 / 06:03 AM IST

మేషం

మీరు మీ ఆర్థిక స్థితితో సంతృప్తి చెందుతారు. చిన్న విషయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మానుకోండి. పెద్ద వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

వృషభం

ఉద్యోగులు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. ఈరోజు ప్రారంభించిన ప్రతి పనిని ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తిచేస్తారు. వ్యాపారులు , విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి…

మిథునం

కుటుంబ సభ్యుల అవసరాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. విద్యార్థులకు చదువు విషయంలో సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. వివాహేతర సంబంధాలకు పూర్తిగా దూరంగా ఉండడం మంచిది.

కర్కాటకం

ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో విభేదాలున్నాయి జాగ్రత్త. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.

సింహం

నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

కన్యా

ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. సమయానికి డబ్బులు చేతికి అందకపోవడంతో చేపట్టిన పనులు ఆగిపోతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ వాతావరణం బాగానే ఉంటుంది.

తులా

ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు తగ్గుతాయి. కొత్త ఉపాధి మార్గాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు…

వృశ్చికం

ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరగడం వల్ల ఆ ప్రభావం మీ బడ్జెట్ పై పడుతుంది. ఉన్నత చదువుకోసం ప్రయత్నించే విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు తప్పవు..

ధనుస్సు

మేధావుల సహవాసం లభిస్తుంది. సాంకేతిక రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు చాలా మంచిది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు సాధారణ ఫలితాలున్నాయి

మకరం

మకర రాశి వారు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. మీ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. వైవాహిక జీవతం బావుంటుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.

కుంభం

మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార లక్ష్యాలను సకాలంలో సాధిస్తారు. వ్యక్తిగత విషయాలను బయటి వ్యక్తులతో పంచుకోవద్దు. రియల్ ఎస్టేట్‌లో పెద్ద పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది.

మీనం

ఈ రోజు మీరు అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. మీ భావాలను అందరి ముందు చెప్పొద్దు. అనవసర ఆలోచనల కారణంగా ఇబ్బంది పడతారు.

Latest News