Site icon vidhaatha

మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ప్ర‌మాదాల్లో ప్ర‌యాణాలు..! జ‌ర జాగ్ర‌త్త‌..!!

మేషం

మేష రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చి సువర్ణావకాశం నేడు మీ ఇంటి తలుపు తట్టవచ్చు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. భవిష్యత్తు కోసం తగిన పొదుపు చేసుకోగలుగుతారు. వ్యాపారులు కొత్త అవకాశాల ద్వారా వ్యాపారంలో గొప్ప మైలురాళ్లు సృష్టించుకుంటారు.

వృషభం

వృషభ రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన పనులను ఈ రోజు పూర్తి చేసుకుంటే మంచిది. శుభకార్యాలకు ఈ రోజు శ్రీకారం చుడితే నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఆర్ధిక లబ్ది పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మానసికంగా, శారీరకంగా చురుకుగా ఉంటారు. తొందరపాటు స్వభావం వల్ల ఒక గొప్ప అవకాశం చేజారిపోయే ప్రమాదముంది.

మిథునం

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ చర్యలు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి కాబట్టి ఇతరులకు దురభిప్రాయం కలిగేలా నడుచుకోవద్దు. ఏ పని చేసినా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం మంచిది. మీ ప్రియమైన వారికోసం అధికంగా ధనవ్యయం చేస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు, సవాళ్లు ఎదురైనా తీవ్రమైన కృషితో, కఠిన శ్రమతో అధిగమిస్తారు. కుటుంబంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఆరోగ్యం అంతగా సహకరించకపోవచ్చు.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. గ్రహసంచారం అనుకూలంగా లేనందున జాగ్రత్తగా ఉండటం మంచిది. అనుకోని ప్రమాదాలు, ఆపదలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో వాదనలు ఘర్షణల్లో మౌనంగా ఉంటే మంచిది. ఓర్పు సహనంతో ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. బంధు మిత్రుల ద్వారా ఆర్ధిక లబ్ది ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో అదనపు ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకుంటారు. అదృష్టం కలిసి వచ్చి పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యాపారంలో పురోగతి ఉంటుంది.

తుల

తులా రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి పనిభారం పెరగడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి. ప్రయాణాలలో ప్రమాదాలు జరగవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలకు సంబంధించి చర్చలు, సమావేశాలతో రోజంతా ఉరుకులు, పరుగులతో గడిచిపోతుంది. తెలివిగా వ్యవహరించి అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు కొత్త ప్రతిపాదనలు ఆమోదించి విదేశాలకు వెళ్లే అవకాశాలను అందుకుంటారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున మీరు ఏర్పరచుకునే బంధాలు జీవితాంతం ఉంటాయి. వృత్తి పరంగా గొప్ప విజయాలను అందుకుంటారు. వ్యాపారంలో రుణభారం తగ్గుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు వృత్తినిపుణులు, వ్యాపారులకు అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యుల కారణంగా మీకు అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో అనూహ్యంగా పదోన్నతులు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తీవ్రమైన శ్రమతోనే పనులుపూర్తవుతాయి. కీలకమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేక ప్రభావం చూపే అవకాశముంది. ఆర్ధిక లావాదేవీల్లో నష్టం వాటిల్లే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్త. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా కొత్త వ్యక్తులను కలుస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యక్తిగత జీవితం, పనిలో కొత్త బాధ్యతలు చేపట్టే విషయంలో మీరు ఒకింత ఆందోళనకు గురువతారు. సహచరుల సహకారంతో ఒత్తడిని అధిగమిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

Exit mobile version