25.04.2024 గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారు కోపానికి పోవ‌ద్దు..!

చాలా మంది జ్యోతిష్యాన్ని న‌మ్ముతుంటారు. ఏ ప‌ని ప్రారంభించినా స‌రే త‌మ రాశుల ఫ‌లితాల‌ను బ‌ట్టి ప‌నుల‌ను, శుభ‌కార్యాల‌ను ప్రారంభిస్తారు మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - April 25, 2024 / 06:09 AM IST

మేషం

మేషరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల వారికి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మిత్రులతో కలిసి రోజంతా ఆనందంగా గడుపుతారు. గృహసంబంధ విషయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా అంది. ఈ రోజు మీకు సంతోషం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. ఆర్థిక లాభాలున్నాయి. ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పనులు ఈ రోజు నెరవేరే అవకాశం ఉంది.

మిథునం

మిధునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో ఒడిదొడుకులు కారణంగా మీరు మానసిక అశాంతికి గురవుతారు.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. తెలియని బాధతో మీరు బాధ పడుతూ ఉంటారు. ఉద్యోగులు మెరుగైన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. నిరాశకు గురి కావద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మేలు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. తగినంత విశ్రాంతి అవసరం. ముఖ్యమైన విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సన్నిహితులతో కలహాలకు ఆస్కారముంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఎప్పటి నుంచో వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అనుకోని అదృష్టం మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.

తుల

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కళ, సాహిత్య రంగాల వారికి ఈ రోజు అన్ని పనుల్లో జయం ఉంటుంది. అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా బలపడతారు.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అయితే ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. చిన్నపాటి శస్త్ర చికిత్స జరిగే అవకాశముంది. మనోబలంతో ముందుకెళ్లండి. విజయం మీదే! ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా అలోచించి నిరాశకు గురవుతారు. ఆరోగ్యం సహకరించదు. ఒక వార్త మానసిక ఆనందాన్ని ఇస్తుంది.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపారంలో ఆశించినంత పురోగతి ఉండదు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఉద్యోగులు నిదానమే ప్రదానం అన్నట్లు వ్యవహరిస్తే మేలు.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీదైన శైలిలో పని చేసి అందరి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు ప్రయోజనాలు ఇస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అదృష్టం అందీఅందనట్లుగా ఊరిస్తుంది. ఉద్యోగస్తులు సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు ఉంటాయి.

Latest News