26.05.2024 ఆదివారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - May 26, 2024 / 06:15 AM IST

మేషం

మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు ఇబ్బందికరంగా, సంక్లిష్టంగా మారుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగులకు పని ప్రదేశంలో సమస్యలు ఎదురవుతాయి.

వృషభం

వృషభ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఆదాయం ఆశించిన మేరకు ఉండదు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గృహంలో కలహాలు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఉద్యోగులకు పని ఒత్తిడి తప్పదు. వ్యాపారులకు పోటీదారుల నుంచి తీవ్రమైన పోటీ ఉంటుంది.

మిథునం

మిథున రాశి వారికి మీరు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా ఉత్సాహంగా సంతోషంగా గడిచిపోతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ధనాదాయం వృద్ధి చెందుతుంది. బంధువర్గంలో, సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. కుటుంబసభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ రోజు లక్ష్మీకటాక్షం ఉంటుంది. పెట్టుబడుల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. మీ పనితీరుకుపై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సన్నిహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీ కుటుంబసభ్యులతో కలిసి విహారయాత్రకు ఏర్పాట్లు చేస్తారు. వృత్తి నిపుణులకు, ఉద్యోగులకు ఈ రోజు చేసే అన్ని పనుల్లో విజయం ఉంటుంది.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. సోమరితనం, బద్దకంతో పనులన్నీ వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే శక్తి లోపిస్తుంది. ఇంట్లో గొడవల కారణంగా ప్రశాంతత ఉండదు. ఆస్తి వ్యవహారాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు.

తుల

తులా రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా గడిచిపోతుంది. పర్యటక ప్రదేశాలను సందర్శిస్తారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయి. అన్ని రంగాల వారు తాము ఎంచుకున్న రంగంలో గణనీయమైన పురోగతి సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఉన్నతమైన మీ వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. వ్యాపారులు గొప్ప లాభాలను అందుకుంటారు. అవసరానికి సరిపడా డబ్బు చేతికి అందుతుంది.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ అవసరం. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. గృహంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేసే ప్రతి పనిలోనూ ఆచి తూచి ముందడుగు వేస్తే మేలు. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సమీప బంధువులతో గొడవలు ఉండవచ్చు.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు శుభప్రదమైన రోజు. వృత్తి వ్యాపార నిపుణులకు అదృష్టం వరిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. స్థిరాస్తి రంగం వారికి లాభాల పంట పండుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అసూయపరులతో జాగ్రత్తగా ఉండండి.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు మీకు ఆశాజనకంగా లేదు. చిన్న విషయాలకే బాధపడిపోతారు. ప్రతికూల ఆలోచనలతో నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. మనోబలం పెంచుకోండి. లేకుంటే మీ శత్రువుల నుంచి ముప్పు ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

Latest News