27.04.2024 శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు మాట తీరు మార్చుకోక‌పోతే ఇబ్బందే..!

చాలా మంది జ్యోతిష్యాన్ని న‌మ్ముతుంటారు. ఏ ప‌ని ప్రారంభించినా స‌రే త‌మ రాశుల ఫ‌లితాల‌ను బ‌ట్టి ప‌నుల‌ను, శుభ‌కార్యాల‌ను ప్రారంభిస్తారు మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - April 27, 2024 / 06:44 AM IST

మేషం

మేషరాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి కనబరుస్తారు. గృహంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యాపారులకు ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

వృషభం

వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మిమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ మౌనమే వారికి గట్టి సమాధానం అవుతుంది. గొడవలకు దిగకుండా ప్రశాంతంగా ఉంటే అన్ని సమస్యలు సర్దుకుంటాయి. ఆర్ధికంగా బలోపేతం అవుతారు.

మిథునం

మిథున రాశి వారికి ఈ రోజు బాగా లాభదాయకంగా ఉంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు పదోన్నతి, బదిలీకి అవకాశం ఉంది. గృహంలో శాంతి సౌఖ్యం ఉంటాయి. స్త్రీ మూలక ధనలాభం ఉంటుంది.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పనులు వాయిదా పడకుండా చూసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. నూతన ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. ఇంట్లో కలహాలకు అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకొని జాగ్రత్తగా మాట్లాడండి.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఇంట్లో అనవసరమైన వాదనలు వస్తాయి. కుటుంబంలో ఘర్షణ వాతావరణం ఉంటుంది. మానసికంగా అశాంతికి గురవుతారు. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. ప్రతికూల ఆలోచనలు వీడితే మేలు.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా శారీరకంగా సంతోషంగా ఉంటారు. సన్నిహితుల సహకారంతో పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆర్ధిక ప్రయోజనాలుంటాయి. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి.

తుల

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనవసరంగా అన్నింటికీ ఉద్రేకపడే మీ స్వభావంతో చాలా నష్టపోతారు. సహనం లేకపోవడం వల్ల ప్రతి విషయంలో చిరాకు, కోపం ఎక్కువగా ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే విషయాన్ని గుర్తించి మసలుకోవాలి.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల నుంచి చిన్నపాటి కానుకలు అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వ్యర్ధ ప్రసంగాల కారణంగా సమస్యల్లో చిక్కుకుంటారు. మాట తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవు. ఆర్ధిక నష్టం సూచితం. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు చాలా అద్భుతంగా ఉండబోతోంది. మీ ప్రియమైన వ్యక్తులను కలుసుకుంటారు. అవివాహితులకు అతి త్వరలో వివాహం జరుగుతుంది. మీ మిత్రులు మీకు గొప్ప కానుకలను ఇచ్చి మిమ్మల్నిఆశ్చర్యంలో ముంచెత్తుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వృత్తి వ్యాపార రంగాల వారు రాణిస్తారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇది మీలో ఉత్సాహం నింపుతుంది.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనుకోని సమస్యలు ఎదురుకావడం వల్ల గందరగోళంగా ఉంటారు. ఆరోగ్యం లోపిస్తుంది. పని ప్రదేశంలో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. బంధువుల నుంచి ఒక దుర్వార్త అందుతుంది.

Latest News