27.05.2024 సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ప్ర‌యాణాలు వాయిదా వేస్తే మంచిది..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - May 27, 2024 / 06:47 AM IST

మేషం

మేషరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రోజు మీరు అనవసరమైన వాదనలు, అర్థంలేని చర్చలకు దూరంగా ఉంటే మంచిది. ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. గృహంలో శాంతి సౌఖ్యం ఉంటాయి.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. తీరికలేని పనితో అవిశ్రాంతంగా ఉంటారు. ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. పనిలో మీకు ఆటంకాలు ఎదురవుతాయి.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో శాంతి సంతోషం నెలకొంటాయి. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు పని ప్రదేశంలో సానుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. నూతన బాధ్యతలు చేపడతారు. మీ పోటీదారులపై విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మీ అదుపులేని కోపం కారణంగా శత్రువులు పెరుగుతారు. మీ ప్రతిభతో మంచి ఫలితాలు సాధిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

కన్య

క‌న్యా వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగల మీ ప్రతిభతో మంచి ఫలితాలు సాధిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.

తుల

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సరదాగా గడుపుతారు. సమాజంలో గౌరవమర్యాదలు, కీర్తి ప్రతిష్ఠలు పెరుగు తాయి. ఇంట్లో కలహాలు చికాకు కలిగిస్తాయి. కొత్త ప్రా జెక్టులు మొదలు పెట్టేందుకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఇంట్లో గొడవలు అశాంతిని కలిగిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సహనంతో ఉంటే పరిస్థితులు చక్కబడతాయి. వివాదాలకు, వాదనలకు దూరంగా ఉండండి.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికపరమైన లాభాలు ఉంటాయి. చేపట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆత్మవిశ్వాసంతో కూడిన మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మేలు.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులు, వృత్తి నిపుణులు తమ రంగాల్లో కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో కొంత గందరగోళం నెలకొంటుంది. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆర్థికపరంగా, వృత్తిపరంగా మంచి లాభాలు, పదోన్నతులు లభిస్తాయి. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు.

Latest News