Site icon vidhaatha

29.04.2024 సోమ‌వారం మీ రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు ఆర్థిక వృద్ధి ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా విశ్రాంతి లోపిస్తుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. లేకుంటే సమస్యలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు చేసేవారికి పనిలో ఆటంకాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో పని చేస్తే విజయం మీదే.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త పనుల జోలికి పోవద్దు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.

మిథునం

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం, కీర్తి పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉంది. వ్యాపారులకు పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులు అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి పై అధికారుల ప్రశంసలు పొందుతారు. విపరీతమైన ధనదాయం ఉంటుంది. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. ప్రతికూల పరిస్థితులను నుంచి గట్టెక్కుతారు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్స్​తో పాటు జీతం కూడా పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగం లభిస్తుంది. పట్టింది బంగారం అన్నట్లుగా ఉంటుంది.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. మానసికంగా శారీరకంగా చాలా ఒత్తిడి అనుభవిస్తుంటారు. సన్నిహితులతో గొడవలకు అవకాశముంది. ఆస్తి వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉంటే మేలు. సహనంతో ఉంటే మేలు.

తుల

తులారాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. సోదర వర్గం వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. విదేశాల నుంచి ఒక శుభవార్త అందుతుంది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి నష్టాలు ఉండే అవకాశం ఉంది. వ్యాపారులకు వ్యాపారం మందకొడిగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో వాదనలు పెట్టుకోవద్దు.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. చేపట్టిన కొత్త పనులన్నీ సకాలంలో పూర్తి చేసి మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ప్రతి విషయంలో ఆచి తూచి అడుగు వేయాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. బంధుమిత్రులతో బేదాభిప్రాయాలు వస్తాయి.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి విపరీతమైన ధనాదాయం ఉంటుంది. వ్యాపారులకు పెట్టుబడుల రూపంలో, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు. పితృ సంబంధిత ధన లాభం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారులకు ప్రయాణాలు లాభిస్తాయి.

Exit mobile version