29.05.2024 బుధ‌వారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - May 29, 2024 / 07:17 AM IST

మేషం

మేషరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు కొన్ని ఆటంకాలు ఎదురైనా మీ ప్రతిభతో వాటిని అధిగమిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు వ్యాపారులకు సర్వత్రా విజయం ఉంటుంది.

మిథునం

మిధునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దురలవాట్ల జోలికి పొతే సమాజంలోపరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుంది. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. మీ ప్రతిష్టను దిగజార్చడానికి శత్రువులు పొంచి ఉన్నారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు గ్రహబలం బాగుంది. చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. నిజాయితీతో పనిచేసి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. సమాజంలో మంచి పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం పొందుతారు. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా అవసరం. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ప్రయాణాలలో శ్రద్ధ అవసరం.

కన్య

కన్యరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు నూతన బాధ్యతలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాల పట్ల అప్రమత్తం అవసరం.

తుల

తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో సమస్యలు, ఆటంకాలు ఎదురు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగులకు పని భారం పెరగడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. మనోబలంతో పనిచేస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోండి.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు, పెట్టుబడుల రూపంలో ధన ప్రవాహం ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుబంధాలు దృఢపడతాయి. కీలకమైన వ్యవహారాల్లో చర్చలు సఫలం అవుతాయి.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు సాధారణంగా గడుస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవడంలో సందిగ్ధత, అనిశ్చితి ఉంటాయి. వ్యాపారులకు అనుకోని రీతిలో వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి, ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు పనికి వస్తాయి.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూల వాతావరణం, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. గృహంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. కష్టపడి పనిచేసి మంచి గుర్తింపు పొందుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. తీరికలేని పనులతో అవిశ్రాంతంగా ఉంటారు. ప్రత్యర్థులపై పై చేయి సాధించడంపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి నిపుణులు, ఉద్యోగులు మంచి ఫలితాలు పొందుతారు. సమష్టి కృషితో పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి.

Latest News