02.06.2024 ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి స్వ‌ల్ప అనారోగ్యం..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 2, 2024 / 06:15 AM IST

మేషం

మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపతాపాలకు పక్కన పెడితే మంచిది. ఆర్ధిక ప్రయోజనాలు ఆశించిన మేరకు ఉంటాయి. వృత్తి ఉద్యోగులకు పనిలో సవాళ్లు ఎదురవుతాయి. కొంచెం సమయస్ఫూర్తితో వ్యవహారిస్తే అన్ని సమస్యలు దూరమవుతాయి.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు శుభఫలితాలు ఉంటాయి. ఈ రోజంతా సంతోషంగా సరాదాగా గడిచిపోతుంది. ఉద్యోగులకు చిరకాల కోరిక తీరి కోరుకున్న పదోన్నతి దక్కుతుంది. ఆర్ధిక ప్రయోజనాలు కూడా ఆశించిన మేరకు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉంది.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. పనికి సంబంధించి శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈరోజు పనులన్నీ విజయవంతం అవుతాయి. ఉన్నతాధికారులు మీ పనితీరుతో సంతోషంగా ఉంటారు. పదోన్నతులకు ఆస్కారం ఉంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనుకోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. వ్యాపారులకు తోటి వ్యాపారుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటారు.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వ్యాపారులకు పెట్టుబడులు, లాభాలు రూపంలో ధనప్రవాహం ఉంటుంది. శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు గతంలో కష్టపడి చేసిన కృషి ఫలాలను ఇప్పుడు సంతోషంగా పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

తుల

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశీయానం చేసే అవకాశం ఉంది. ఓ శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు వ్యాపార సంబంధిత ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఈ రోజువిద్యార్థులు చక్కని ప్రతిభతో మంచి విజయాలు సాధిస్తారు. సినీ పరిశ్రమ, కళారంగం వారికి అనుకూలంగా ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. సంతానానికి సంబంధించిన ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. కొత్తగా పనులు మొదలు పెట్టాలనుకునేవారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు విపరీతమైన లాభాలను అందుకుంటారు. అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది. గృహంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తివ్యాపార రంగాల వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. దూరప్రాంతాల నుంచి అందిన శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. గృహంలో కలహపూరిత వాతావరణం ఉంటుంది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది. లాభాలకు చాలా అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

Latest News