02.05.2024 గురువారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

చాలా మంది జ్యోతిష్యాన్ని న‌మ్ముతుంటారు. ఏ ప‌ని ప్రారంభించినా స‌రే త‌మ రాశుల ఫ‌లితాల‌ను బ‌ట్టి ప‌నుల‌ను, శుభ‌కార్యాల‌ను ప్రారంభిస్తారు మ‌రి ఈ రోజు రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - May 2, 2024 / 06:06 AM IST

మేషం

మేషరాశి వారికి ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. వాదనలకు దూరంగా ఉంటే మేలు. ముఖ్య వ్యవహారాల్లో దూకుడు తగ్గించుకుంటే మేలు. మీకు ఎంతో ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం

వృషభరాశి వారికి కొన్ని రకాల సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. ఈ సమస్యల పరిష్కారానికి కొంత సమయం పట్టినా కఠిన శ్రమ, సహనంతో వాటిని పరిష్కరిస్తారు. పనుల్లో ఆలస్యం ఉండవచ్చు కాబట్టి నిరాశ చెందకండి. సన్నిహితుల సహకారంతో పనులన్నీ పూర్తవుతాయి.

మిథునం

మిధునరాశి వారికి ఈ రోజు గ్రహసంచారం అనుకూలంగా లేదు. ఆందోళన తగ్గించుకుని ప్రశాంతంగా ఉండడం మేలు. ప్రతికూల ఆలోచనలు, నిరాశావాదం వీడండి. పూర్తి విశ్రాంతి అవసరం. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేసే పనిలో పురోగతి ఉంటుంది. ఆర్ధిక అభివృద్ధి ఉంటుంది. కొన్ని కీలక విషయాల్లో మీ సిద్ధాంతాలను పక్కన పెట్టి రాజీ ధోరణి అవలంబిస్తే మేలు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మేలు. సన్నిహితులతో ప్రియమైన సంభాషణలు చేస్తారు. వ్యాపారస్థులకు ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగస్థులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మధురమైన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆనందంలో మునిగిపోతారు. మీ శ్రేయోభిలాషులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. స్థిరాస్తి వ్యాపారులకు మంచి కాలం నడుస్తోంది.

తుల

తులారాశి వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ రోజు అనుకోని విజయాలు, ఆర్ధిక ప్రయోజనాలు ఒకేసారి కలిసి వస్తాయి. ఈ రోజు మీ ఆనందానికి హద్దు ఉండదు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళతారు. ఆర్ధిక పురోగతి ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల కోసం ఖర్చులు ఉంటాయి. ఆదాయం కూడా పెరుగుతుంది.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాలవారు గతంలో చేసిన పొరపాట్ల గురించి ఆలోచించడం మానేసి, ప్రస్తుతం సమష్టి కృషితో విజయం సాధించడంపై దృష్టి సారించండి. సహనం, సంయమనంతో ఉంటే విజయం మీదే.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిత్రులతో సరదాగా గడుపుతారు. జీవిత భాగస్వామితో కలిసి విందువినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. మాతృవర్గం వారితో కలహాల కారణంగా మానసిక అశాంతికి గురవుతారు.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజంతా ఆధ్యాత్మిక కార్యక్రమంలో గడుపుతారు. దైవసంబంధమైన కార్యక్రమాల కోసం ధనవ్యయం చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు. వ్యాపారస్థులు మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్థులకు ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. మీ ప్రతిభతో మంచి నిర్ణయాలు తీసుకొని అందరినీ మెప్పిస్తారు. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి మంచి సమయం నడుస్తోంది.

Latest News