31.05.2024 శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి శుభ స‌మ‌యం..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - May 31, 2024 / 06:57 AM IST

మేషం

మేష రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ప్రతిపనిలోను విజయం లభిస్తుంది. సన్నిహితుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాద బలం ఉంటుంది. జీవితభాగస్వామితో విందు వినోదాలలో పాల్గొంటారు.

వృషభం

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు మొదలుపెట్టడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఆర్ధిక లాభాలు, ప్రమోషన్​కు కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

మిథునం

మిధున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఈ రోజు కొత్త పనులు మొదలు పెట్టడం మంచిది కాదు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఉద్యోగులకు పని ప్రదేశంలో ప్రతికూలతలు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆచి తూచి వ్యవహరించడం అవసరం. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయండి. ఉద్యోగస్తులకు పనులన్నీ ఆలస్యంగా పూర్తవుతాయి. ఆర్ధిక వ్యహారాలు పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమష్టి నిర్ణయాలతో ముందుకెళ్తే మంచిది. మోసం చేసే వారు పక్కనే ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. వృత్తి నిపుణులు, వ్యాపారులు, ఉద్యోగులకు ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. అనుకోని ధనలాభం.

తుల

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. ఉద్యోగులు అత్యంత ప్రతిభతో పని చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. అన్ని రంగాలవారికి కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు అద్భుతమైన ప్రయోజనాలను అందుకుంటారు. వ్యాపారులకు గతంలో దూరమైన భాగస్వాములు తిరిగి దగ్గరవుతారు. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతారు.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సృజనాత్మకతో పనిచేసి మంచి ప్రయోజనాలు సాధిస్తారు. ఉన్నత విద్యావకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఆశించిన ప్రయోజనాలు దక్కుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది. గృహంలో శాంతి నెలకొంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు తారాబలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. గతంలో ఎన్నడూ లేనంతగా గొప్ప లాభాలను అందుకుంటారు. కుటుంబసభ్యులతో విందువినోదాలలో పాల్గొంటారు. శుభ సమయం నడుస్తోంది.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. వారస్వత్వ ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో సహనంతో ఉండడం అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్హ వహించండి. అనారోగ్య సమస్యల కారణంగా ధనవ్యయం ఉంటుంది.

Latest News