Site icon vidhaatha

04.05.2024 శ‌నివారం రాశిఫ‌లాలు.. ఒక మ‌హిళ వ‌ల్ల ఈ రాశివారి జీవితంలో గొప్ప మ‌లుపు..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు ఈ రాశి వారు అనేక ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందగలరు. మంచి లాభాలను అందుకుంటారు. జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టేందుకు ఎదురుచూస్తున్న వారికి శుభసమయం ఆసన్నమయింది.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు అద్బుతమైన రోజు. వ్యాపారులు ఈ రోజు విపరీతమైన లాభాలను అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. మీ పనికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇది మీకు పేరు, ప్రఖ్యాతలతో పాటు సమాజంలో గుర్తింపును తీసుకువస్తుంది.

మిథునం

మిథునరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. వివాదాలకు పోకుండా రాజీ ధోరణి అవలంబిస్తే మేలు. విలాసాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారులు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మేలు.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ముఖ్య వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉంటే మేలు. మీ కుటుంబ గౌరవానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయవద్దు. ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు మీరు మానసికంగా, శారీరకంగా కూడా సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. మొదలు పెట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. కొన్ని సంఘటనలు బాధను కలిగిస్తాయి. సహనంతో, సమయానుకూలంగా వ్యవహరిస్తే మేలు.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అద్భుతమైన రోజు. ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. వ్యాపారులు భాగస్వాముల నుంచి ప్రయోజనాలను పొందవచ్చు. పలు రకాల ఆర్థిక ప్రయోజనాలను ఈ రోజు అందుకుంటారు.

తుల

తులారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక, స్థిరాస్తి పెట్టుబడులకు ఈ రోజు మంచి రోజు. ఒక మహిళ కారణంగా మీ జీవితం గొప్ప మలుపు తిరుగుతుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మేలు.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయట ఒత్తిడి కారణంగా ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మితిమీరిన చాదస్తం ధోరణితో ఉండకండి. ఈ ధోరణి మీ పనులకు ఆటంకంగా మారుతుంది. సర్దుబాటు గుణం పెంచుకోండి. పని ఒత్తిడి ఉండవచ్చు. ఖర్చులు ఆదాయాన్ని మించి ఉంటాయి.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. లక్ష్య సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేయండి. అన్నింటిలోనూ మీరు విజయాన్ని అందుకుంటారు. ఆదాయానికి లోటుండదు.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలను వీడండి. దైవబలం అండగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే విజయం మీదే! ఉద్యోగులకు ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఈ రోజు మంచి ఫలితాలను పొందడానికి మీ శక్తి యుక్తులను పూర్తిగా వినియోగించాలి. మీ కుటుంబ సభ్యులు, ప్రియమైనవారితో వాగ్వివాదాలకు అవకాశం ఉంది కాబట్టి ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి.

Exit mobile version