మేషం
మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి, వ్యాపారాలలో ఏకాగ్రత లోపించి పనితీరు దెబ్బతినవచ్చు. పని పట్ల దృష్టి మరలి పోకుండా జాగ్రత్త వహించాలి. విజయానికి కృషి తప్ప వేరే అడ్డదారులు ఉండవని గ్రహించాలి. అతి తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనం పొందాలని అత్యాశకు పోతే సమస్యల్లో చిక్కుకుంటారు.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించిన శుభవార్త మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని సరదాగా గడుపుతారు. వ్యాపారులకు ఈరోజు ఆశాజనకంగా ఉంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తీరికలేని ఇంటి పనులు, బాధ్యతలతో ఈ రోజంతా విశ్రాంతి లేకుండా గడుపుతారు. వృత్తిపరంగా అద్భుతమైన ప్రతిభను కనబరచి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆర్థికంగా పరపతి పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పరోపకారం చేయాలనే మీ ప్రయత్నం ఫలించదు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు సాధించేందుకు మరింత శ్రమించాలి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. సహచరుల సహకారంతో గట్టెక్కుతారు. కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంలో మౌనాన్ని ఆశ్రయించడం మంచిది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. ఆడుతూ, పాడుతూ సరదాగా లక్ష్యాలను సాధిస్తారు. అసూయపరుల విమర్శలు పట్టించుకోవద్దు. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్నేహితులతో మంచి సమయాన్ని గడపడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎంత శ్రమిస్తే అంత గొప్ప ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో సానుకూలత ఉంటుంది. అయితే అనుకోని విధంగా ఆరోగ్యం ఆకస్మికంగా క్షీణించడం వల్ల పరిస్థితి సమస్యాత్మకంగా మారుతుంది.
తుల
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తీవ్రమైన కృషితో కష్టించి పనిచేసి మీ రంగంలో రారాజుగా నిలుస్తారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. పదిమందికి ఉపాధి కల్పించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీడియా, పత్రిక రంగాల వారు నూతన అవకాశాలు అందుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీలోని నాయకత్వ లక్షణాలతో టీమ్ లీడర్‌గా ప్రమోషన్ పొందుతారు. వ్యాపారులు వ్యాపార సంబంధిత పనులపై ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండడం అవసరం. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. తీవ్రమైన కోపావేశాల కారణంగా కుటుంబంలో ఘర్షణ పూరిత వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. మీ తల్లి గారి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆర్థికపరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఊహించని ఖర్చులు ఈ రోజు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఆదాయం ఆశించిన మేరకు ఉండదు. రుణభారం పెరుగుతుంది. వ్యాపారంలో నష్టాలు చూడాల్సి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున ఈ రోజు చిన్న విషయానికి కూడా అతిగా స్పందిస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. కోపాన్ని నిగ్రహించుకోండి. ఇంద్రియాలపై అదుపు సాధించండి. లేకపోతే ఇంట్లోనూ, ఆఫీస్‌లోనూ కూడా వాతావరణం ఇబ్బందికరంగా మారుతుంది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పాత, మధురమైన జ్ఞాపకాలతో ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తే మంచిది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు.