Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న గడ్డు పరిస్థితుల నుంచి బయట పడతారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరగడం వల్ల సంతృప్తిగా ఉంటారు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నూతన పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వృత్తి వ్యాపారాలలో సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పురోగతి ఉంటుంది. బుద్ధిబలంతో ఓ కీలక విషయంలో విజయం సాధిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవడంలో సందిగ్దత నెలకొంటుంది. భావోద్వేగాలను అదుపు చేయడంలో విఫలం అవుతారు. కుటుంబ సమస్యలకు సంబంధించిన చర్చలలో సంయమనం పాటించండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులలో పని చేసే అవకాశం రావడం వల్ల ఆనందంగా ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. అదృష్టం కలిసివచ్చి అనుకోని విధంగా సంపదలు వరిస్తాయి. మీ ప్రత్యర్ధులు వారి ఓటమిని అంగీకరించి మౌనంగా పక్కకు తప్పుకుంటారు.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే సమస్యలను కుటుంబ సభ్యుల సహకారంతో అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉండవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. వ్యాపారంలో నష్టాలు ఉండవచ్చు. చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున కోరినవన్నీ పొందగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో విజయం చేకూరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు వృద్ధి చెందుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులకు ప్రయాణాలు కలిసి వస్తాయి.
తుల
తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిని ఈ రోజు అనారోగ్య సమస్యలు చుట్టు ముడతాయి. పనిపట్ల ఏకాగ్రత లోపిస్తుంది. శత్రువులు పుంజుకునే ప్రమాదముంది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ఒక కీలక వ్యవహారంలో ఆర్థిక నష్టం ఉండే అవకాశం ఉంది.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. పనిప్రదేశంలో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అదృష్టం వరించి అనుకున్నవన్నీ సాధిస్తారు. ఆర్థిక అంశాలలో స్వబుద్ధితో, తెలివిగా వ్యవహరించి లాభం పొందుతారు. ఉద్యోగులు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. సహోద్యోగులకు మీ సహకారాన్ని అందిస్తారు.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలం, తెలివితేటలతో పనిచేస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. బద్దకాన్ని వీడి చురుకుగా ఉంటే కార్యసిద్ధి ఉంటుంది. రచయితలకు, కవులకు శుభసమయం నడుస్తోంది. గిట్టనివారి విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వకండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా అనేక ఇబ్బందులు, ఒత్తిడి పెరిగే అవకాశం వుంది. కోపావేశాలకు లోను కాకండి. దైవారాధనలో గడిపితే ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ వాదనలు దిగవద్దు. ఇతరులను బాధపెట్టే విధంగా ప్రవర్తించవద్దు. ఇంట్లో శుభకార్యాల మూలక ధనవ్యయం ఉండవచ్చు.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహగతులు అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పురోగతి సంతృప్తినిస్తుంది. వ్యాపారులు భాగస్వాముల సహకారంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. సినీ, కళా రంగం వారు గొప్ప అవకాశాలు అందుకుంటారు.