Turmeric Water | ప‌సుపు వాట‌ర్‌తో స్నానం చేస్తే.. త్వ‌ర‌గా పెళ్లి అవుతుందట‌..!

  • Publish Date - April 12, 2024 / 07:43 AM IST

Turmeric Water | ప‌సుపు వంట‌కాల్లోనే కాకుండా ఆయుర్వేదంగా కూడా ఉప‌యోగిస్తారు. ఇక చాలా మంది ప‌సుపు వాట‌ర్‌తో స్నానం చేస్తుంటారు. త‌మ ఆరోగ్య స‌మ‌స్య‌ల దృష్ట్యా మ‌హిళ‌లే అధికంగా పసుపు వాట‌ర్‌తో స్నానం చేస్తుంటారు. ప‌సుపు నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల ఆరోగ్య ప‌రంగా లాభ‌ప‌డ‌మే కాకుండా..చాలా ర‌కాలుగా బెనిఫిట్స్ పొందొచ్చ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

పెళ్లి త్వ‌ర‌గా అవుతుంద‌ట‌..

పెళ్లి కోసం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా సంబంధాలు కుద‌ర‌వు. ఏదో ఒక కారణం చేత క్యాన్సిల్ అవుతుంటాయి. వివాహం కోసం ప్ర‌యత్నం చేసే వారు ఎవ‌రైనా స‌రే.. ప్ర‌తి గురువారం ప‌సుపు నీటితో స్నానం చేస్తే.. త్వ‌ర‌గా వివాహం జ‌రుగుతుంద‌ట‌. దీంతో పాటు గురువారం విష్ణుమూర్తి విగ్ర‌హానికి ప‌సుపు నీటితో అభిషేకం చేయ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా వివాహ‌మై, జీవితంలో సానుకూల‌త ఏర్ప‌డుతుంద‌ట‌.

అదృష్టం త‌లుపు త‌డుతుంద‌ట‌..

ప‌సుపు వాట‌ర్‌తో స్నానం చేయ‌డం వ‌ల్ల ప్ర‌తికూల శ‌క్తులు తొల‌గిపోతాయ‌ట‌. అంతేకాకుండా అదృష్టం త‌లుపు త‌డుతుంద‌ట‌. ఆర్థిక శ్రేయ‌స్సు కూడా ల‌భిస్తుంద‌ట‌. మాన‌సిక ప్రశాంత‌త కూడా ఉంటుంద‌ని పండితుల న‌మ్మ‌కం.

ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో..

పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. మొటిమలు, మచ్చలు పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలను దూరంగా ఉంచడంలో పసుపు నీటి స్నానం చాలా బాగా సహాయపడుతుంది. అయితే.. మీకు నిరంతర చర్మ సమస్యలు ఉంటే.. పసుపు నీటితో స్నానం చేసే ముందు ఒకసారి చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం మంచిది.

Latest News