Site icon vidhaatha

Astrology | అక్టోబ‌ర్ నెల‌లో ఈ నాలుగు రాశుల వారికి తిరుగులేని విజ‌యాలు..!

Astrology | అంద‌రి జీవితం ఒకేలా ఉండ‌దు. ఒక్కొక్క‌రి జీవితం( Life ) వారి ఆర్థిక స్థితిగ‌తులు( Finance Problems ), కుటంబ ప‌రిస్థితుల‌పై( Family Problems ) ఆధార‌ప‌డి ఉంటుంది. ఈ క్ర‌మంలో చాలా మంది చాలా ర‌కాల బాధ‌లు ప‌డుతుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ప‌డ‌డం, మాన‌సికంగా కుంగిపోయి ఏం చేయాలో తోచ‌ని ప‌రిస్థితి దాపురిస్తుంది. అయితే ఈ నాలుగు రాశుల వారికి గ‌త కొన్ని నెల‌లుగా ప‌ట్టిపీడిస్తున్న అన్ని స‌మ‌స్య‌ల‌కు అక్టోబ‌ర్( October ) నెల‌లో ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. మ‌రి ఆ నాలుగు రాశులు ఏంటో తెలుసుకుందాం..

కర్కాటక రాశి  (Cancer) 

క‌ర్కాట‌క రాశి ( Cancer ) వారికి అక్టోబ‌ర్ నెల క‌లిసివ‌స్తుంది. జీవితంలో సానుకూల మార్పులు తీసుకొస్తుంది. అన్ని రంగాల వారికి క‌లిసొచ్చి.. ఆదాయ వ‌న‌రులు పెరుగుతాయి. గ‌త కొన్ని నెల‌ల నుంచి ఎదురైన స‌మ‌స్య‌లు ఓ కొలిక్కి వ‌చ్చి ప‌రిష్క‌రించ‌బ‌డుతాయి. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సహకారంతో చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. చేపట్టిన పనులను ధైర్యంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

సింహ రాశి (Leo)

సింహ రాశి ( Leo ) వారికి కూడా ఈ నెల క‌లిసి వ‌స్తుంది. చేప‌ట్టిన ప్ర‌తి ప‌నిని స‌జావుగా పూర్తి చేస్తారు. ఆదాయం మెరుగుప‌డుతుంది. గత రెండు మూడు నెలల నుంచి ఎదురైన ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం సహా ఏ రంగంలో ఉన్నప్పటికీ ఈ నెలలో మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మీ ప్రణాళికల విషయంలో గోప్యంగా ఉంచి అడుగువేస్తే.. విజయం సాధిస్తారు.

తులా రాశి  (Libra) 

ఈ నెలలో శుక్రుడి అనుగ్రహం ఉండడం వల్ల తులా రాశి ( Libra ) వారికి తిరుగుఉండదు. అన్ని రంగాల్లో ఉండేవారు, వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. రావాల్సిన బాకీలు చేతికి అందుతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడుతారు. భూ సంబంధింత లావాదేవీల్లో అనుకూలత ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకోవడం మంచిది. రాజకీయ నాయకులను కలుస్తారు.

మకర రాశి  (Capricorn)

ఈ రాశివారికి అక్టోబరు నెల కలిసొస్తుంది. అన్నిరంగాల్లో వారికి శుభఫలితాలున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. ఈ నెల రెండో వారంలో ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణంలో కొత్త పరిచయాలు కలిసి వ‌స్తాయి. ఆర్థిక లాభం ఉంటుంది. నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు.

Exit mobile version