Vastu Tips | బీరువా( Beeruva ) లేని ఇల్లు ఉండనే ఉండదు. ఆ బీరువాలో బట్టలు( Clothes ), బంగారు నగలు( Gold Ornaments ), డబ్బులు( Money ) దాచి పెడుతుంటారు. అలా విలువైన వస్తువులు దాచి ఉంచే బీరువా విషయంలో వాస్తు నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం బీరువాను ఉంచకపోతే ఆ ఇంట ఆర్థిక కష్టాలు( Financial Problems ) సంభవిస్తాయట. అంతేకాదు.. బీరువాలో కొన్ని వస్తువులు తప్పనిసరిగా ఉంచాలని సూచిస్తున్నారు. అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఇక బీరువాను ఉత్తర దిశ( North ) వైపు మాత్రమే పెట్టాలని పండితులు సూచిస్తున్నారు. ఉత్తర దిక్కు కుబేర స్థానం కావడం వల్ల ధనవృద్ధి కలుగుతుందని చెబుతున్నారు. అయితే.. బీరువాను సరైన ప్రాంతంలో పెట్టడంతో పాటు కొన్ని వస్తువులు ఉంచాలని, దాంతో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు. డబ్బులు పెట్టుకునే చోట గోవింద నామాల పుస్తకం, లక్ష్మీ అష్టోత్తకం ఉంటే మంచిదట. బీరువాలో నోట్లు, చిల్లర, బంగారం వేర్వేరుగా పెట్టుకోవాలట. ఇలా విడివిడిగా దాచిపెట్టుకుంటే లక్ష్మీ దేవత అనుగ్రహం కలుగుతుందని తెలిపారు. ఒక వెండి లేదా రాగి పాత్రలో కర్పూరం పెడితే లక్ష్మీ అనుగ్రహం కలిగి విశేషమైన ధనలాభం వస్తుందని వివరించారు.
ప్రధానంగా బీరువాలో ఎరుపు రంగు( Red Color ) వస్త్రం ఉంచకూడదట. ఎరుపు రంగు వస్త్రం ఉంచడం కారణంగా ధన వృద్ధి ఆగిపోతుందట. సాధ్యమైనంత వరకు బీరువాలో తెల్లటి కాటన్( White Cloth ) వస్త్రాన్ని ఉంచాలని పండితులు సూచిస్తున్నారు. ఈ వైట్ కలర్ వస్త్రంపై అత్తరు రాసి పెడితే మరింత లాభం చేకూరుతుందని చెబుతున్నారు.
ప్రతిరోజూ బీరువా తెరిచి అగరుబత్తీలు వెలిగించి చూపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అంటున్నారు. బీరువాపైన కలువ పూవులో కూర్చుని కుడి చేతితో బంగారు నాణెలు వక్షిస్తున్న లక్ష్మీ దేవత ఫొటో అతికించాలని సూచించారు.