Site icon vidhaatha

కాళీయమర్దనాలంకారములో శ్రీకోదండరామస్వామి కటాక్షం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవరోజు బుధ‌వారం ఉదయం కాళీయమర్దనాలంకాములో స్వామివారు కటాక్షించారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

వాహనసేవ అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు స్నపన తిరుమంజనం  నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేస్తారు.  

     ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూప‌రింటెండెంట్ శ్రీ వెంక‌టేశ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు‌ శ్రీ ధ‌నంజ‌యులు, శ్రీ గిరిబాబు, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 29న చక్రస్నానం

శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు ఆల‌యంలో చక్రస్నానం నిర్వ‌హించ‌నున్నారు. రాత్రి 7.00 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయ.

ఏప్రిల్ 30న పుష్పయాగం

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు.

Exit mobile version