Crows | పిండాలను కాకులకే ఎందుకు పెడతారు..! పురాణాలు ఏం చెబుతున్నాయంటే..?

Crows | కాకి.. ఈ ప‌క్షిని ప్ర‌తి ఒక్క‌రూ చూసే ఉంటారు. ఎందుకంటే ప్ర‌తి గ్రామంలో చెట్ల‌పై అటు ఇటు తిరుగుతూ కావ్ కావ్ మ‌ని అరుస్తూ ఉంటుంది. ఇలా కాకులు అరిస్తే అరిష్ట‌మ‌ని, ఏదో చావు వార్త అందుతుంద‌ని, చుట్టాలు వ‌స్తార‌ని న‌మ్ముతుంటారు. ఒక ర‌కంగా కాకిని చెడుకు సంకేతంగా భావిస్తారు. కానీ కాకిలో మంచి ల‌క్ష‌ణాలు కూడా ఉన్నాయ‌ని పురాణాలు చెబుతున్నాయి.

  • Publish Date - June 12, 2024 / 07:49 AM IST

Crows | కాకి.. ఈ ప‌క్షిని ప్ర‌తి ఒక్క‌రూ చూసే ఉంటారు. ఎందుకంటే ప్ర‌తి గ్రామంలో చెట్ల‌పై అటు ఇటు తిరుగుతూ కావ్ కావ్ మ‌ని అరుస్తూ ఉంటుంది. ఇలా కాకులు అరిస్తే అరిష్ట‌మ‌ని, ఏదో చావు వార్త అందుతుంద‌ని, చుట్టాలు వ‌స్తార‌ని న‌మ్ముతుంటారు. ఒక ర‌కంగా కాకిని చెడుకు సంకేతంగా భావిస్తారు. కానీ కాకిలో మంచి ల‌క్ష‌ణాలు కూడా ఉన్నాయ‌ని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించే ఒకేఒక పక్షి కాకి అని చెబుతున్నారు. బ్రహ్మ ముహూర్తంలో అంటే వేకువ జామునే మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి. సూర్యాస్తమయం తర్వాత ఎట్టిపరిస్థితుల్లోను ఆహా ముట్టుకోని జీవి సూర్యగ్రహణానికి ముందు, గ్రహణం పూర్తి అయ్యాక స్నానం చేసే ఏకైక పక్షి కాకి. మ‌రి ఇంత‌టి నిష్ట‌తో ఉండే కాకుల‌కే ఎందుకు పిండాలు పెడుతారు..! దీని వెనుకాల ఉన్న ర‌హ‌స్యం ఏంటి, పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.

మ‌రి ముఖ్యంగా చనిపోయిన వారి ఆత్మలు కాకి రూపంలో వస్తాయని నమ్మకం. అందుకే వారిని తలుచుకుని కాకికి పిండం పెడతారని అంటారు. కాకులు పూర్తిగా తింటే మన పెద్దలు సంతృప్తిగా ఉన్నారని.. ఒకవేళ కాకులు ముట్టుకోకుంటే వారి కోరికలు ఏవో మనం నెరవేర్చలేదని అందుకే అసంతృప్తితో ఉన్నారని భావిస్తారు. దీనివెనుక పురాణాల్లో ఓ కథ కూడా ప్రచారంలో ఉంది.

కాకిలోకి ప్ర‌వేశించిన య‌ముడు..!

రావణుడి బారి నుంచి తప్పించుకునేందుకు దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోకి ప్రవేశించారట. తొండలోకి కుబేరుడు, లేడిలోకి ఇంద్రుడు, నెమలిలోకి వరుణుడు, యుముడు కాకిలోకి ప్రవేశిస్తారు. రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలోంచి బయటు వచ్చిన దేవతలు వాటికి వరమిస్తారు. లేడికి వళ్లంతా కళ్లున్నట్టు అందంగా ఉండే వరం ఇచ్చాడు ఇంద్రుడు..అందుకే లేడి ఒళ్లంతా కళ్లున్నట్టు కనిపిస్తుంది. వర్షం పడే సమయంలో ఆనందంతో పురివిప్పి అందంగా ఆడేలా నెమలికి ఫించం ఇచ్చాడు వరుణుడు. కాకికి బలవర్మణం తప్ప స్వతహాగా మరణం ఉండదని వరమిచ్చాడు యముడు. ఇక యమలోకంలో నరకం అనుభవించే వారిలో కాకులు ఎవరి పిండం అయితే తింటాయో వారికి ఈ నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పాడు. అప్పటి నుంచీ పిండాలను కాకులకు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తుంటారు, కాకులకి ఆహారం పెడితే నీ పూర్వీకులకి చేరుతుందని ఒక వరం ఇస్తాడు, రాముడి వరం ప్రకారమే నేటికీ కాకులకి ఆహారాన్ని పెడతారని కూడా చెబుతారు.

Latest News