Cutting Nails | సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత గోర్లు క‌త్తిరిస్తున్నారా..? అయితే ఈ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వట‌..!

Cutting Nails | ఇంట్లో మంచి జ‌ర‌గాలంటే కొన్ని నియ‌మాలు, ప‌ద్ధ‌తులు పాటించాల‌ని పెద్ద‌లు చెబుతూ ఉంటారు. ఆ ప‌ద్ధ‌తుల‌ను, నియమాల‌ను ఇప్ప‌టికీ చాలా మంది పాటిస్తున్నారు. కానీ కొంద‌రు మాత్రం పొర‌పాట్లు చేస్తూనే ఉంటారు. ఈ పొర‌పాట్ల‌లో ప్ర‌ధాన‌మైన‌ది.. సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత గోర్ల‌ను క‌త్తిరించ‌డం.

  • Publish Date - July 4, 2024 / 07:30 AM IST

Cutting Nails | ఇంట్లో మంచి జ‌ర‌గాలంటే కొన్ని నియ‌మాలు, ప‌ద్ధ‌తులు పాటించాల‌ని పెద్ద‌లు చెబుతూ ఉంటారు. ఆ ప‌ద్ధ‌తుల‌ను, నియమాల‌ను ఇప్ప‌టికీ చాలా మంది పాటిస్తున్నారు. కానీ కొంద‌రు మాత్రం పొర‌పాట్లు చేస్తూనే ఉంటారు. ఈ పొర‌పాట్ల‌లో ప్ర‌ధాన‌మైన‌ది.. సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత గోర్ల‌ను క‌త్తిరించ‌డం. ఇలా సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత గోర్ల‌ను క‌త్తిరించ‌డం ఆ ఇంట్లో అశుభానికి దారి తీస్తుంది. మంగ‌ళ‌వారం, శుక్ర‌వారం రోజున అస‌లు గోర్లు క‌ట్ చేయ‌కూడ‌దు. అదే విధంగా ఏ రోజు కూడా సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత గోర్ల‌ను క‌త్తిరించొద్దు అని సూచిస్తున్నారు.

సూర్యాస్తమయం తర్వాత గోర్లను కట్ చేయకూడదనే ఆచారం ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్నారు. దీని వల్ల పలు సమస్యలు వస్తాయంటారు. మరి సూర్యాస్తమయం తర్వాత ఎందుకు గోర్లను కట్ చేయకూడదు? దీని వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

సూర్యాస్తమయం తర్వాత గోర్లను కట్ చేయడం వల్ల ఆర్థిక క‌ష్టాలు వెంటాడుతాయ‌ని భావిస్తారు. అంతే కాదు జీవితంలో కూడా కష్టాలను ఎదుర్కుంటారని, మ‌నం తీసుకునే ఆహారం విష‌యంలో కూడా అవస్థలు ఏర్పడతాయని న‌మ్ముతారు.

అలాగే సాయంత్రం పూట గోర్లను కట్ చేయడం వల్ల శని గ్రహానికి కోపం వస్తుందని అంటారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని విశ్వ‌సిస్తుంటారు. అలాగే అప్పులు చెల్లించడంలో ఇబ్బందులు, ఆదాయం తగ్గిపోతుందట.

జ్యోతిష్య కారణాలు ఏంటంటే.. రాత్రి పూట శని గ్రహాన్ని పాలక గ్రహంగా భావిస్తారు. కాబట్టి ఈ సమయంలో గోర్లు కట్ చేయడం వల్ల శని, రాహుల గ్రహాల ప్రభావం పడుతుందని నమ్ముతారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత గోర్లు కట్ చేయకూడదని పెద్ద‌లు చెబుతుంటారు.

 

Latest News