Site icon vidhaatha

రేపు దోస్త్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

హైద‌రాబాద్ : డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాల నిమిత్తం దోస్త్ 2024 నోటిఫికేష‌న్ రేపు విడుద‌ల కానుంది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల స‌మ‌యంలో తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి కార్యాల‌యంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ విద్యా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం, ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రితో పాటు ప‌లువురు అధికారులు పాల్గొనున్నారు.

రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధుల్లో ఉన్న డిగ్రీ కాలేజీల్లో దోస్త్ ద్వారా ఫ‌స్టియ‌ర్‌లో ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నారు. ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త పొందిన విద్యార్థులు దోస్త్‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మొత్తం మూడు విడ‌త‌ల్లో అడ్మిష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది.

Exit mobile version