Site icon vidhaatha

Rajiv Gandhi Civils Abhaya Hastham | సివిల్స్ కు రూ. 1 లక్ష ఆర్ధిక సాయం: రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కోసం ఇలా అప్లయ్ చేయండి

Rajiv Gandhi Civils Abhaya Hastham

సివిల్స్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేరయ్యే వారికి తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద రూ. 1 లక్ష ఆర్ధిక సహాయం చేస్తోంది. ఆర్థిక సమస్యల కారణంగా కొందరు సివిల్స్ పరీక్షలకు దూరంగా ఉంటున్నారు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వంఈ స్కీమ్ ను ప్రారంభించింది. యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్స్ సర్వీసెస్ పరీక్షలో ప్రిలిమ్స్ లో క్వాలిఫై మెయిన్స్ అర్హత సాధించిన అభ్యర్థులు ఈ పథకం కింద ఆర్ధిక సహాయం కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. 2024 జూలై 20న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది.

తెలంగాణ నుంచి ప్రతి ఏటా వందల సంఖ్యలో సివిల్స్ పరీక్షలు రాస్తున్నారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు సగటున 400 నుంచి 500 మంది ఎంపిక అవుతున్నారు. మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూ ప్రక్రియకు చేరుకుంటున్న వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల నుంచి ఇటీవల కాలంలో పెరుగుతూ వస్తోంది. సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి ఖర్చు ఎక్కువ. ఈ ఖర్చుకు భయపడే కొందరు ప్రిలిమ్స్ వరకే వెళ్లి వెనుదిరుగుతున్నారు. అలాంటి వారి కోసమే ప్రభుత్వం ఈ స్కీమ్ ను ప్రవేశ పెట్టింది. సివిల్స్ సర్వీసెస్ 2025 కు తెలంగాణ నుంచి 178 మంది ఎంపికయ్యారు. వీరికి ఈ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం రూ. 1 లక్ష రూపాయాలను ఆర్ధిక సాయం అందించింది. ఈ ఏడాది ఆగస్టు 13న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వారికి చెక్కులను అందించారు.

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకానికి అర్హులు ఎవరు?

ఈ పథకం కింద ధరఖాస్తు చేసే అభ్యర్థులు తెలంగాణలో శాశ్వత నివాసం కలిగి ఉండాలి.
ధరఖాస్తుదారుడి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షలు దాటవద్దు
యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ పరీక్షల్లో క్వాలిఫై అయి ఉండాలి
షెడ్యూల్ కులాలు (ఎస్ సీ)
షెడ్యూల్ తెగలు ( ఎస్టీ)
సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ప్రాధాన్యత ఇస్తారు.
ఒక్కసారి మాత్రమే ఈ స్కీమ్ కింద ధరఖాస్తుదారుడికి సాయం అందిస్తారు.

కావాల్సిన డాక్యుమెంట్లు

ధరకాస్తుదారుడి స్కాన్ చేసిన సంతకం
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ అప్లికేషన్ ఫారం
యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు
ఆధార్ కార్డు
బ్యాంక్ ఖాతా వివరాలు
క్యాన్సిల్డ్ చెక్
నివాస సర్టిఫికెట్
ఆదాయ సర్టిఫికెట్
కుల ధృవీకరణ పత్రం
బ్యాంక్ నుంచి మ్యాండేట్ ఫామ్

ఎలా ధరఖాస్తు చేయాలి?

సింగరేణి కాలరీస్ సంస్థ అధికారిక వెబ్ సైట్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలి. ధరఖాస్తుదారుడు తమ మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీతో తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతి ఏటా సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ స్కీమ్ కింద ఆర్ధిక సహాయం కోసం సింగరేణి సంస్థ అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది. ఆ సమయంంలో ధరఖాస్తు చేసుకోవాలి.

Exit mobile version