Site icon vidhaatha

కరోనా లేని గ్రామం ఎక్కడుందో తెలుసా..?

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దొనకొండ మారుమూల చిన్న పల్లె. నూతన గ్రామ పంచాయతీగా ఆవిర్భవించిన ఈ చిన్న గ్రామంలో 540 మంది నివసిస్తారు.

ఎక్కడ విన్నా.. ఎక్కడ చూసినా .. కరోనా మిగిల్చిన కన్నీటి గాధలే.. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కొవిడ్​ విజృంభిస్తోంది . కరోనా కట్టడికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా.. దాని ఉద్ధృతి మాత్రం తగ్గలేదు. కాని దొనకొండ గ్రామంలో మాత్రం కరోనా పప్పులుడకలేదు..

కరోనా మొదటి దశలో దంతాలపల్లి మండలం దొనకొండ గ్రామంలో సుమారు 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బతుకుదెరువు కోసం హైదరాబాద్​తోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారంతా లాక్​డౌన్ సమయంలో తిరిగి సొంతూరు బాట పట్టటంతో ఇక్కడ అధిక మొత్తంలో కేసులు నమోదయ్యాయి.
రెండోదశలో అప్రమత్తమైన గ్రామస్థులు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని.. భౌతిక దూరం పాటించాలంటూ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో డప్పు చాటింపు వేశారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరు రాకపోవటంతో మండలంలోని 17 పంచాయతీల్లో దొనకొండ ఒక్కటే కరోనా రహిత గ్రామంగా నిలిచి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

Exit mobile version