Site icon vidhaatha

అభ్యంతర పోస్టులకు గ్రూపు అడ్మిన్‌ది బాధ్యత కాదు

వాట్సాప్‌ గ్రూపులో ఇతర సభ్యులు చేసిన అభ్యంతకర పోస్టులకు ఆ గ్రూపు అడ్మినిస్ట్రేటర్‌ బాధ్యులు కాదని బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. 33 ఏండ్ల వ్యక్తిపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో బెంచ్‌ ఈ ఉత్త్వరులు ఇచ్చింది. గత నెలలో ఇచ్చిన ఈ తీర్పు కాపీ ఇటీవల తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఒక వాట్సాప్‌ గ్రూపు అడ్మిన్‌కు సభ్యుల్ని జత చేయడం, తొలగించడం వంటి పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయనీ, అంతేకానీ గ్రూపులో పోస్ట్‌ చేసే విషయాలను నియంత్రించడం, సెన్సార్‌ చేసే అధికారం ఉండదని జస్టిస్‌ జడ్‌.ఎ. హక్‌, జస్టిస్‌ ఎబి బార్కర్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక వాట్సాప్‌ గ్రూపు అడ్మినిస్ట్రేటర్‌ కిషోర్‌ తరోన్‌ వేసిన పిటిషన్‌పై బెంచ్‌ ఈ తీర్పు ఇచ్చింది. సమాచార సాంకేతిక చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం 2016లో గొండియా జిల్లాలో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కిషోర్‌ ఈ పిటిషన్‌ వేశారు.

Exit mobile version