Site icon vidhaatha

పల్స్‌ ఆక్సీమీటర్‌ అంటే ఏమిటి ఎలా పనిచేస్తుంది-ఎందుకు ఉపయోగిస్తారు

పల్స్ అంటే నాడి ఆక్సీ అంటే ఆక్సిజన్ మీటర్ అంటే కొలిచే సాధనం అని అర్ధం ఇది చిన్న బాటరీల తో పనిచేస్తుంది.

పల్స్‌ ఆక్సీమీటర్‌ ఉపయోగిస్తే ఏమి తెలుస్తుంది.
మనిషి శరీరములో ని రక్తం లో ఆక్సిజన్ శాతాన్ని,గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలుస్తుంది.

పల్స్‌ ఆక్సీమీటర్‌ ఎలా పనిచేస్తుంది:

ఈ పల్స్‌ ఆక్సీమీటర్‌ ను సాధారణంగా వేలికి పెట్ట ఆన్ చేయగనే ఇన్ఫ్రారెడ్ కిరణాలను వెలికి ఉన్న రక్త కేసనాళాలోనికి పంపిస్తుంది ఈ కిరణాలు రక్తం గ్రహించే మార్పు అసదారంగా రక్తం లో ఆక్సిజన్ శాతాన్ని లెక్కిస్తుంది.

సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వారిలో 95 నుంచి 99 శాతం వరకు ఆక్సిజన్ ఉంటుంది.

శ్వాసక్రియలో మనం పీల్చుకోనే గాలి లోని ఆక్సిజన్ ను ఊపిరితిత్తుల ద్వారా రక్తం గ్రహించి రక్త నాళాల ద్వారా శరీరానికి అంతా సరఫరా అవుతుంది.
కరోనా లేదా కొన్ని రకాల జబ్బులతో బాధపడుతున్న వారిలో కొన్ని సందర్భాలలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. ఈ ఆక్సిజన్ శాతాన్ని బట్టి అవసరమైతే పేషంట్ కు
ఆక్సిజన్ పెడతారు.

పల్స్‌ ఆక్సీమీటర్‌ ఎలా ఉపయోగించాలి..?

  1. పల్స్‌ ఆక్సీమీటర్‌ పెట్టుకొనే
    చేతి వెలుకు ఏదైనా క్రీం లేదానెయిల్‌ పాలిష్‌ ఉంటే తీసివేసి ఉపయోగించాలి
  2. చేతులు తడిగా ఉంటే తుడుచుకుని తడి ఆరిన తరువాత ఉపయోగించాలి
  3. పల్స్‌ ఆక్సీమీటర్‌ వాడే ముందు కనీసం ఐదు నిమిషాలు విశ్రాంతిగా ఉంది ఆందోళన లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఉపయోగించాలి

4.పల్స్‌ ఆక్సీమీటర్‌ను కనీసం నిమిషం పాటు చేతి వేలికి ఉంచాలి.
5.రీడింగ్‌ స్థిరంగా చూపించే వరకు అలాగే ఉంచాలి. కనీసం ఐదు సెకన్ల పాటు రీడింగ్‌లో ఎలాంటి మార్పు లేకపోతే దానిని అత్యధిక రికార్డుగా భావించాలి.

6.ఊపిరి తీసుకోవడం కష్టం అనిపించానా ఆక్సిజన్‌ లెవల్స్‌ 92 శాతం తక్కువగా ఉన్నా వైద్యున్ని సంప్రదించాలి.

Exit mobile version