Site icon vidhaatha

చైనా స్కూల్లో అగ్ని ప్రమాదం.. 18 మంది మృతి

విధాత‌: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 18 మంది మృతి చెందగా.. మరో 16 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదం సెంట్రల్ చైనాలోని మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలో చోటు చేసుకుంది. హెనాన్‌ ప్రావిన్స్‌లోని షాంగ్‌కియు నగరంలోని జెచెంగ్‌ కౌంటీలో శుక్రవారం తెల్లవారు జామున మంటలు చెలరేగాయని స్థానిక మీడియా తెలిపింది. ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది మృతి చెందారని, 16 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఈ నెల 13న సెంట్రల్‌ హుబెయి ప్రావిన్స్‌లో గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలుడు సంభవించడం 25 మంది మరణించగా..138 మంది వరకు గాయపడ్డ విషయం తెలిసిందే. భద్రతా నిర్వహణలో లోపాలు బయటపడడంతో కంపెనీకి చెందిన ఎనిమిది మంది ఉద్యోగులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version