Site icon vidhaatha

ఆమె క‌డుపులో వృష‌ణాలు..! పెళ్లికి ముందు మ‌గాడిన‌ని చెప్పిన యువ‌తి

ఆమె పుట్టుక‌తో ఆడ.. కానీ పెరుగుతున్న కొద్ది ఆమె శ‌రీరంలో మార్పులు వ‌చ్చాయి. పేరుకే యువ‌తి కానీ.. రుతుక్ర‌మం లేదు. స్థ‌నాల్లో పెరుగుద‌ల లేదు. దీంతో ఆమెకు ఆమెనే తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైంది. చివ‌ర‌కు పెళ్లికి ముందు తాను మ‌గ అని చెప్పేసింది. దీంతో త‌ల్లిదండ్రులు వైద్యుల‌ను సంప్ర‌దించ‌గా.. ఆమె పొత్తి క‌డుపులో వృష‌ణాలు ఉన్న‌ట్లు తేలింది. దీంతో ఆమె నిజంగానే మగ అని డాక్ట‌ర్లు నిర్ధారించారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. చైనాలోని హుబే ప్రావిన్స్‌కు చెందిన లి యువాన్ వ‌య‌సు ప్ర‌స్తుతం 27 ఏండ్లు. ఆమెకు 18 ఏండ్ల వ‌య‌సు వ‌చ్చిన‌ప్పటికీ రుతుచ‌క్రం ప్రారంభం కాలేదు. దీంతో హాస్పిట‌ల్ వెళ్లి వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుంది. ఆమెలో హార్మ‌న్ లెవ‌ల్స్ అబ్‌నార్మ‌ల్‌గా ఉన్న‌ట్లు వైద్య ప‌రీక్ష‌ల్లో తేలింది. అండాశ‌యం ఎదుగుద‌ల కూడా లోపించింద‌ని తెలిపారు. క్రోమోజోమ్ టెస్ట్ చేయించుకోవాల‌ని డాక్ట‌ర్లు ఆమెకు సూచించిన‌ప్ప‌టికీ.. నిర్ల‌క్ష్యం చేసింది.

పెళ్లి ఖాయం కావ‌డంతో..

ఇక లి యువాన్‌కు త‌ల్లిదండ్రులు పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించారు. దీంతో భ‌య‌ప‌డ్డ ఆమె హాస్పిట‌ల్‌కు వెళ్లింది. మ‌ళ్లీ వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, కాన్‌జెనిట‌ల్ అడ్రెన‌ల్ హైప‌ర్‌ప్లాసియా(CAH) అనే అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్లు తేలింది. నెల రోజుల త‌ర్వాత ఫ‌లితం రాగా.. ఆమెలో పురుష హార్మోన్లు అధికంగా ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయింది. ఆమె పొత్తిక‌డుపులో వృష‌ణాలు ఉన్న‌ట్లు తేలింది. లి యువాన్ చూడ‌డానికి ఆడ మ‌నిషి అయిన‌ప్ప‌టికీ.. క్రోమోజోమ్స్‌లో వ్య‌త్యాసం కార‌ణంగా ఆమె పురుషుడే అని డాక్ట‌ర్లు చెప్పారు.

వృష‌ణాలు తొల‌గింపు..

డాక్ట‌ర్లు చెప్పిన మాట‌ల‌తో లి యువాన్ షాక్‌కు గురైంది. 27 ఏండ్లుగా స్త్రీ మాదిరి జీవించిన తాను ఇప్పుడు పురుషుడు అని తేల‌డంతో ఆందోళ‌న‌కు గురైంది. 50 వేల మంది చిన్నారుల్లో ఒక‌రికి ఇలాంటి రుగ్మ‌త ఉంటుంద‌ని వైద్యులు పేర్కొన్నారు. యువాన్ త‌ల్లిదండ్రులు రిసెసివ్ డిజార్డర్‌కు కారణమైన జన్యువులను క‌లిగి ఉండ‌టంతోనే యువాన్‌లో పురుష ల‌క్ష‌ణాలు వ‌చ్చాయ‌ని స్ప‌ష్టం చేశారు. యువాన్ డి విట‌మిన్ లోపంతో బాధ‌ప‌డుతున్నార‌ని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో ఆమె క‌డుపులో ఉన్న వృష‌ణాల‌ను వైద్యులు శ‌స్త్ర‌చికిత్స నిర్వ‌హించి తొల‌గించారు. ఎందుకంటే ఇది క్యాన్స‌ర్‌కు దారి తీయొచ్చ‌నే కార‌ణంతోనే వృష‌ణాల‌ను తొల‌గించారు.

Exit mobile version