Donald Trump | అధ్యక్ష ఎన్నికల్లో నేను గెలిస్తే దేశం నుంచి భారీగా బహిష్కరణలు : డొనాల్డ్‌ ట్రంప్‌

Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిస్తే దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని స్థాయిలో భారీగా దేశ బహిష్కరణలు ఉంటాయని, పెద్ద ఎత్తున బహిష్కరణ ఆపరేషన్‌ చేపడుతానని అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) చెప్పారు. తనకు ఓటు వేస్తే రాడికల్‌ ఇస్లామిక్‌ ఉగ్రవాదులను దేశం నుంచి తరిమికొడతానని మిషిగాన్‌లో నిర్వహించిన ప్రచారంలో ఆయన వ్యాఖ్యానించారు.

  • Publish Date - June 17, 2024 / 09:46 AM IST

Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిస్తే దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని స్థాయిలో భారీగా దేశ బహిష్కరణలు ఉంటాయని, పెద్ద ఎత్తున బహిష్కరణ ఆపరేషన్‌ చేపడుతానని అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) చెప్పారు. తనకు ఓటు వేస్తే రాడికల్‌ ఇస్లామిక్‌ ఉగ్రవాదులను దేశం నుంచి తరిమికొడతానని మిషిగాన్‌లో నిర్వహించిన ప్రచారంలో ఆయన వ్యాఖ్యానించారు. ఐసిస్‌తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న 8 మందిని అమెరికా అధికారులు శనివారం అరెస్టు చేసిన సమయంలోనే ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘మన దేశం ఇప్పుడున్నంత ప్రమాదంలో ఎప్పుడూ లేదు. వేలమంది ఉగ్రవాదులు దేశంలో ప్రవేశిస్తున్నారు. దీనికి అనేక ఏళ్లపాటు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఓటరు ఛాయిస్‌ సుస్పష్టం. వేలమంది రాడికల్‌ ఇస్లామిక్‌ ఉగ్రవాదులను దేశంలోకి అనుమతించే అధ్యక్షుడు కావాలా..? లేదంటే అలాంటి వాళ్లను దేశం నుంచి బయటకు తరిమేసే అధ్యక్షుడు కావాలా..? అనేది మీరే నిర్ణయించుకోండి,’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తొలిరోజు నుంచే దేశ చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్‌ను మొదలుపెడతానని ప్రకటించారు.

అగ్రరాజ్యంలోకి వలసలు పోటెత్తుతున్నాయంటూ రిపబ్లికన్లు ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వలసదారులు అమెరికాకు రావడాన్ని డెమోక్రటిక్ నేత, దేశాధ్యక్షుడు జో బైడెన్ సులభతరం చేశారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక సందర్భాల్లో ట్రంప్ తన వలసల వ్యతిరేక విధానాలను ఓటర్ల ముందు ఉంచారు. వలసదారులను పూర్తిగా తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.

Latest News