Site icon vidhaatha

ప్ర‌యాణీకుల‌పై ఆంక్ష‌లు తీసేసిన జ‌ర్మ‌నీ

విధాత:కోవిడ్‌-19 తీవ్రత తగ్గిన నేపథ్యంలో జర్మనీ అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేసింది. భారత్ సహా ఐదు దేశాల ప్రయాణికులకు అనుమతినిస్తూ నిబంధనలు సడలించింది. ఈ మేరకు.. ‘‘డెల్టా వేరియంట్‌తో ప్రభావితమైన ఐదు దేశాల ప్రయాణికులపై విధించిన ఆంక్షలను రేపటి నుంచి ఎత్తివేస్తున్నాం’’ అని భారత్‌లో జర్మనీ రాయబారి వాల్టర్‌ జె. లిండ్నర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
కాగా తాజా సడలింపుల ప్రకారం ఇండియా, యూకే, పోర్చుగల్‌ దేశాల ప్రయాణికులపై నిషేధం ఎత్తివేశారు. ఇక జర్మనీ నివాసులు, పౌరులేగాక ఇతర దేశాల ప్రయాణికులు కూడా దేశంలో ప్రవేశించవచ్చు. అయితే, కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, క్వారంటైన్‌లో ఉండటం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

Exit mobile version