Insurance Payout | ఇన్సూరెన్స్‌ సొత్తు కోసం ‘చావు’ నాటకం..! సీన్‌ కట్‌ చేస్తే కటకటల్లోకి..!

Insurance Payout | ఇన్సూరెన్స్‌ సొత్తు కోసం పలువురు బ్రతికి ఉండగానే చనిపోయినట్లుగా నమ్మించి కంపెనీలకు టోకరా వేస్తున్న వార్తలు చాలానే చూస్తున్నారు. ఓ మహిళ సైతం ప్రాణాలతో ఉండగానే.. సొమ్ము కోసం ‘చావు’ తెలివితేటలను ప్రదర్శించింది.

  • Publish Date - June 23, 2024 / 10:43 AM IST

Insurance Payout | ఇన్సూరెన్స్‌ సొత్తు కోసం పలువురు బ్రతికి ఉండగానే చనిపోయినట్లుగా నమ్మించి కంపెనీలకు టోకరా వేస్తున్న వార్తలు చాలానే చూస్తున్నారు. ఓ మహిళ సైతం ప్రాణాలతో ఉండగానే.. సొమ్ము కోసం ‘చావు’ తెలివితేటలను ప్రదర్శించింది. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించి.. కటకటాలపాలైంది. ఈ ఘటనలో ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. పెర్త్‌ సిటీలో కరెన్ సాల్కిల్డ్ (42) అనే మహిళ జిమ్‌ నిర్వహిస్తున్నది. రూ.5లక్షల డాలర్ల కోసం తను కారు ప్రమాదంలో మృతి చెందినట్లుగా అందరినీ నమ్మించింది. మరణ డెత్‌ సర్టిఫికెట్‌ను సైతం పుట్టించింది.

ఆమె భర్త పేరిట ఇన్సూరెన్స్‌ను క్లయిమ్‌ చేసుకున్నది. ఇన్సూరెన్స్ కంపెనీకి ఆమె అందజేసిన అకౌంట్‌లో 4,77,520 డాలర్లు జమైంది. అయితే, ఇప్పటి వరకు అంతా కథ సాఫీగానే జరిగింది. అయితే, బ్యాంకు అధికారుల చేసిన పని ఆమెను కటకటాల్లోకి నెట్టేలా చేసింది. భర్త పేరిట తీసుకున్న ఖాతాలో ఇన్సూరెన్స్‌ కంపెనీ భారీగా డబ్బులు జమ చేసింది. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు జమ కావడంతో బ్యాంకు అధికారులు అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేశారు. దీంతో ఖాతాను పునరుద్ధరించుకునేందుకు సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆమె వారికి చిక్కేలా చేసింది.

సాల్కిల్డ్ చనిపోయిందంటూ నకిలీ పత్రాలు సమర్పించినట్లుగా ఆమె ఆడిన నాటకాన్ని పసిగట్టారు. కూపీ లాగడంతో మొత్తం ఆమె ఆడిన నాటకం బయటపడింది. డెత్ సర్టిఫికేట్, మరణంపై దర్యాప్తు రికార్డులతో పాటు అనేక ఫేక్‌ సర్టిఫికెట్స్‌ సృష్టించినట్లు తేలింది. ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచగా.. నేరం రుజువైంది. ఈ కేసులో జూలై నెలలో కోర్టు ఆమెకు జైలు శిక్షను ఖరారు చేయనుంది. నిందితురాలు గతంలో మాజీ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశారని, ఎఫ్45 అనే జిమ్‌ను నిర్వహించారని, ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. అలాగే, మరో కేసులో ఓ మహిళ తనకు రొమ్ము క్యాన్సర్ ఉందంటూ ‘గోఫండ్‌మీ’ ద్వారా 25 వేల డాలర్లు ఫండ్ సేకరించిందని సైతం తేలింది.

Latest News