Site icon vidhaatha

కాబుల్‌లోని భారత సిబ్బంది తరలింపు పూర్తి: MEA

విధాత,దిల్లీ: కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి సిబ్బంది తరలింపు పూర్తైందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.సిబ్బంది మొత్తం భారత్‌కు చేరుకున్నట్లు వెల్లడించింది.అలాగే కాబుల్‌ విమానాశ్రయం తెరిచాక అఫ్గాన్‌లోని భారతీయులందరినీ భారత్‌కు తరలిస్తామని పేర్కొంది.మరోవైపు అఫ్గాన్‌ సిక్కులు,హిందువుల తరలింపునకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ-ఎమర్జెన్సీ పేరిట కేంద్ర హోంశాఖ ప్రత్యేక వీసా విధానం ఏర్పాటు చేసింది. అఫ్గాన్‌ పౌరుల దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు ఈ ఎలక్ట్రానిక్‌ వీసా విధానం ఉపయోగపడనుంది.

Exit mobile version