Site icon vidhaatha

Maldives Electon result | మాల్దీవ్స్‌ ఎన్నికల్లో షాకింగ్‌ రిజల్ట్‌.. చైనా అనుకూల పార్టీ ఘన విజయం

Maldives Electon result : మాల్దీవుల పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడయ్యాయి. చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుకు చెందిన రాజకీయ పార్టీ అయిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్‌సీ) ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.

మాల్దీవ్స్‌ పార్లమెంటులో మొత్తం 93 స్థానాలు ఉండగా.. ఆదివారం అర్ధరాత్రి వరకు 86 స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి. అందులో మహ్మద్‌ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్‌సీ) పార్టీ 66 గెల్చుకుంది. అంటే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన దానికంటే ఎక్కువ మెజారిటీనే ముయిజ్జు పార్టీ కైవసం చేసుకుంది.

ఈ వివరాలను మాల్దీవుల ఎన్నికల కమిషన్ ధ్రువీకరించింది. తాజా ఫలితంతో పార్లమెంటుపైన దేశాధ్యక్షుడు ముయిజ్జుకు పట్టు వచ్చినట్లయింది. అంతకుముందు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు మాల్దీవ్స్‌లో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరిగింది. రాత్రికల్లా ఎన్నికల ఫలితం వచ్చేసింది. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ (ఎండీపీ)కి డజనుకు మించి సీట్లు వచ్చే అవకాశం కనిపించడంలేదు.

Exit mobile version