Site icon vidhaatha

వాట్సాప్ లో కొత్త ఫీచర్ .. నెల తర్వాత కూడా మెసేజ్‌ను డిలీట్ చేయొచ్చు

విధాత: వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ని పరిచయం చేయబోతోంది. తాజాగా డిలీట్ ఫర్‌ ఎవ్రీవన్‌ ఫీచర్‌ టైమ్‌ కాలపరిమితిని పొడిగించే పనిలో ఉన్నట్లు సమాచారం. దీంతో యూజర్స్ మెసేజ్‌ పంపిన నెల రోజుల తర్వాత కూడా తమ చాట్ పేజీతోపాటు అవతలి వ్యక్తుల ఛాట్‌ పేజ్‌ నుంచి సదరు మెసేజ్‌ ను డిలీట్ చేయొచ్చు.

ప్రస్తుతం మెసేజ్‌ పంపిన గంటలోపు మాత్రమే ఇరువురి చాట్ పేజ్‌ నుంచి మెసేజ్‌ను డిలీట్ చేయొ చ్చు. గంట దాటితే పంపిన వ్యక్తి పేజ్‌ నుంచి మాత్రమే డిలీట్ అవుతుంది. త్వరలో తీసుకొస్తున్న ఫీచర్‌తో నెలరోజుల తర్వాత కూడా యూజర్‌ తాను పంపిన మెసేజ్‌ని చాట్ పేజ్‌ నుంచి డిలీట్ చేయొచ్చు.

ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వాట్సప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సప్ బీటా ఇన్ఫో(వాబీటాఇన్ఫో) తెలిపింది. అలానే వాట్స ప్ మరో కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

వాబీటా ఇన్ఫో తెలిపిన దాని ప్రకారం వాట్సప్‌ కొత్తగా వీడియో ప్లేబ్యాక్ ఇంటర్‌ఫేస్‌ను తీసుకొస్తుంద ట. ఇందులో యూట్యూబ్‌ లింక్‌లు వాట్సప్‌లో షేర్ చేసినప్పడు వాటిని పాజ్‌ చేయడంతో పాటు పూర్తి స్క్రీన్‌లో వీడియోను ప్లే చేసేలా దీన్ని అభివృద్ధి చేసినట్లు పేర్కొంది.

Exit mobile version