Site icon vidhaatha

ముగ్గురు పిల్లలు వద్దు బాబోయ్‌..!

బీజింగ్‌: జనాభా నియంత్రణపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతి జంటా ముగ్గురు పిల్లల్ని కనేందుకు తాజాగా చైనా ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధానంగా ఉద్యోగినులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రసూతి సెలవుల విషయంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుందని వాపోతున్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు ఎలాంటి ముందస్తు మార్గదర్శకాలు జారీ చేయకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఉద్యోగినులకు ఇబ్బందులు తప్పవంటున్నారు.

మరోవైపు మూడో సంతానంపై ఎవరూ అంతగా ఆసక్తి చూపించడం లేదు. పిల్లల పెంపకం, వారి చదువులకయ్యే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో కేవలం ఒక సంతానంతోనే సరిపెట్టుకుంటున్నారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో అతి కొద్దిమంది మాత్రమే రెండో సంతానానికి మొగ్గు చూపుతున్నారు. 2016 నుంచి ఇద్దరు పిల్లల్ని కనేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించినా, ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడంలేదు.

Exit mobile version