Saulos Klaus | మలావి ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్‌ గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు..!

Saulos Klaus | ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిన ఘటనను మరువక ముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. మలావి ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సైనిక విమానం గల్లంతైంది. ఈ విషయాన్ని మలావి అధ్యక్ష కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానం రాడార్ నుంచి మాయమైందని, దాంతో విమానయాన అధికారులు దాంతో సంబంధాలు కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది.

  • Publish Date - June 11, 2024 / 08:57 AM IST

Saulos Klaus : ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిన ఘటనను మరువక ముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. మలావి ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సైనిక విమానం గల్లంతైంది. ఈ విషయాన్ని మలావి అధ్యక్ష కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానం రాడార్ నుంచి మాయమైందని, దాంతో విమానయాన అధికారులు దాంతో సంబంధాలు కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. గల్లంతైన విమానం జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపింది.

కాగా మలావీ ఉపాధ్యక్షుడు సావులోస్‌ క్లావ్స్‌ చీలిమా (Saulos Klaus Chilima) తోపాటు మరో తొమ్మిది మందితో ఓ సైనిక విమానం సోమవారం దేశ రాజధాని లిలాంగ్వే నుంచి బయల్దేరింది. షెడ్యూల్‌ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో అది దిగాల్సి ఉంది. కానీ ఆ సమయానికి విమానం అక్కడికి చేరుకోలేదు. దాంతో మలావీ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. గల్లంతైన విమానం జాడ కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టింది.

ఇదిలావుంటే మలావీ అధ్యక్షుడు లాజరస్‌ చక్వేరా తన బహమాస్ పర్యటనను రద్దు చేసుకుని గల్లంతైన సావులోస్‌ విమానం సెర్చ్‌ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. సెర్చ్‌ ఆపరేషన్‌ కోసం ఆయన ఇతర దేశాల సాయం కూడా కోరారు. మలావీ మాజీ ప్రథమ పౌరురాలు షానిల్‌ జింబిరి కూడా ఈ విమానంలో ఉన్నట్లు సమాచారం. తొమ్మిది మందితో కూడిన ఈ సైనిక విమానం జూజూ నగరంలో ఓ కేబినెట్‌ మాజీ మినిస్టర్‌ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్లింది.

Latest News