దేశంలో కరోనా విజృంభిస్తోన్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ కట్టడికి భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా కోవాగ్జిన్ సమర్థవంతంగా చెక్ పెడుతున్నట్లు తాము గుర్తించామని వెల్లడించారు. మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ మీడియాతో మాట్లాడిన ఆయన సేకండ్ వేవ్ కట్టడికి కోవాగ్జిన్ బాగా పనిచేస్తుందని.. ఈ విషయాన్ని భారత్‌లో నమోదవుతున్న రోజూవారి డాటా ఆధారంగా తాము గుర్తించినట్లు ఆంథోనీ ఫౌసీ తెలిపారు.
‘‘ఇండియాలో రోజూ కరోనా సోకుతున్న వారి డాటాను పరిశీలిస్తున్నాం. అయితే కోవాగ్జిన్ కారణంగా ఇటీవల కేసుల సంఖ్య స్థిరంగా ఉన్నట్లు గుర్తించాం. సేకండ్ వేవ్‌కు చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్లు తప్పని సరిగా వేయించుకోవాలి’’ అని ఆంథోనీ ఫౌసీ చెప్పినట్లు పీటీఐ తన కథనంలో పేర్కొం