విధాత: 1980దశకం(1980s actors) సినీ స్టార్స్ అంతా ఒక్కచోట చేరారు. 80స్టార్స్ రీ యూనియన్(80sStarsReunion) అన్న పేరుతో వారు గెట్ టూ గెదర్ పార్టీ గ్రాండ్ గా జరుపుకున్నారు. అలనాటి వెండితెర దక్షిణాది, ఉత్తరాది నటులందరూ ఆక్టోబర్ 4న చెన్నైలో రీ యూనియన్ వేడుకకు హాజరై అప్పటి రోజుల్ని..జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సరదాగా గడిపారు. వారి వేడుక ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొత్తం 31 మంది స్టార్స్ ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో చిరంజీవి(Chiranjeevi), వెంకటేశ్, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, రాజ్‌కుమార్ సేతుపతి, నరేశ్, సుప్రియ, నదియ, రాధ, రమ్యకృష్ణ, సుమలత, జయసుధ, శోభనలతో పాటు మరికొందరు అగ్రతారలు సందడి చేశారు.
ఈ ఫొటోలను మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇవి ఎప్పటికీ అందమైన జ్ఞాపకాలని పేర్కొన్నారు. ‘‘80ల నాటి నా ప్రియమైన స్నేహితులతో ప్రతి రీయూనియన్ ఎప్పటికీ మర్చిపోలేను. దశాబ్దాలుగా కొనసాగుతోన్న ఈ బంధం విడదీయరానిది. ఎన్నో అందమైన జ్ఞాపకాలు.. మరెన్నో నవ్వులతో ఈ వేడుక ఆనందంగా సాగింది. ప్రతిసారి మొదటి సమావేశంలానే ఉంటుంది’’ అని చిరు రాసుకొచ్చారు. గత ఏడాది వారి రీ యూనియన్ వేడుక చెన్నైలో వరదల కారణంగా వాయిదా పడింది.